
*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి
సమాజ సేవే లక్ష్యంగా హర్ష కేతన్ ఫౌండేషన్ ను మధిరలో ఘనంగా ప్రారంభించారు. మధిర టౌన్ ఎస్ఐ నవిత గారు ముఖ్య అతిథిగా హాజరై ఫౌండేషన్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ నవిత మాట్లాడుతూ.. హర్ష కేతన్ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు విద్య, నిరుపేదలకు అండగా నిలవడం అభినందనీయమని అన్నారు. సమాజంలో అందరూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, సేవా భావంతో ముందుకు సాగాలని సూచించారు.
ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ.. తమ ఫౌండేషన్ ద్వారా పేదలకు నిత్యావసర సరుకులు, విద్యార్థులకు పుస్తకాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎస్ఐ నవిత తమ ఫౌండేషన్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లంకా కొండయ్య, సర్పంచ్ సిద్ది పోగు ప్రసాద్, పుతుంపాక కృష్ణ ప్రసాద్ ఎమ్మార్పీఎస్ నాయకులు దాస్ ఫౌండేషన్ సభ్యులు, స్థానిక ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

