ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

వీరాయిపల్లిలో వరి, వేరుశనగ పంటలపై క్షేత్ర సందర్శన

📰 Generate e-Paper Clip

చీడపీడలు, వ్యాధులు, పోషక లోపాల గుర్తింపు.. రైతులకు శాస్త్రీయ సూచనలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 16 2026: పెద్దమందడి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (టీఆర్‌వీకే), వనపర్తి మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెద్దమందడి మండలంలోని వీరాయిపల్లి గ్రామంలో వరి, వేరుశనగ పంటల్లో చీడపీడలు, వ్యాధుల నిర్ధారణ కోసం క్షేత్ర సందర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌వీకే కో-ఆర్డినేటర్ ఎన్. నవత, పెద్దమందడి మండల వ్యవసాయ అధికారి సైదులు యాదవ్ సంయుక్తంగా రైతుల పొలాలను సందర్శించారు. పంటల ఎదుగుదల, పోషక లోపాలు, చీడపీడలు, వ్యాధుల ఉధృతి, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి రైతులతో ప్రత్యక్షంగా చర్చించారు.క్షేత్ర పరిశీలనలో వరి పంటలో పొటాష్ (K) లోపం, BLB, నల్లి, కాండం తొలిచే పురుగు ఉధృతిని గుర్తించారు. పొటాష్ లోప నివారణకు లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున 13-0-45 ను ఆకులపై పిచికారీ చేయాలని సూచించారు. BLB నివారణకు ప్లాంటమైసిన్ 100 గ్రాములు/ఎకరం, నల్లి నివారణకు ఓబేరోన్ 200 మి.లీ./ఎకరం చొప్పున పిచికారీ చేయాలని సూచించారు. 

కాండం తొలిచే పురుగు నివారణకు ముందస్తు చర్యగా ఫెరోమోన్ ట్రాప్‌లు ఏర్పాటు చేయాలని, పురుగు ఉధృతి ఆర్థిక నష్టం స్థాయిని దాటినప్పుడు క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 ఎస్‌సీ @ 60 మి.లీ./ఎకరం లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ @ 10 కిలోలు/ఎకరం వినియోగించాలని రైతులకు సూచించారు.

వేరుశనగ పంటలో రసాన్ని పీల్చే పురుగుల ఉధృతి గమనించిన నేపథ్యంలో పసుపు రంగు స్టిక్కీ ట్రాప్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరాన్ని బట్టి ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్‌ఎల్ @ 60 మి.లీ./ఎకరం, థయామెథాక్సామ్ 25 డబ్ల్యుజీ @ 40 గ్రాములు/ఎకరం లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ./లీటర్ నీటికి పిచికారీ చేయాలని సూచించారు. రైతులు సకాలంలో విత్తడం, విత్తన శుద్ధి చేయడం, పంటలను క్రమం తప్పకుండా పరిశీలించడం వంటి సమగ్ర పంట యాజమాన్య పద్ధతులను పాటించాలని అధికారులు సూచించారు. చీడపీడలు, వ్యాధులు, పోషక లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకు సిఫార్సు చేసిన పద్ధతులను మాత్రమే అనుసరించడం ద్వారా పంట నష్టాలను తగ్గించి మెరుగైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌వీకే వనపర్తి కో-ఆర్డినేటర్ ఎన్. నవత, పెద్దమందడి మండల వ్యవసాయ అధికారి సైదులు యాదవ్ తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

Latest Articles

అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతులు ఆగం

  వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాపొలిటికల్ పవర్...

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి:...

తెలంగాణ చరిత్ర ను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బీజేపీ కమలాకర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

NSS వారి ఆధ్వర్యంలో జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మొక్కలు నాటిన మునిసిపల్ చైర్మన్ శ్రీ వెలుగు ప్రశాంత్ కుమార్

   //పొలిటికల్ పవర్ పత్రిక.ప్రతినిధి.ఎల్లస్వామి జమ్మికుంట //జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

Related Articles

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 16 2026: వినాయక చవితి పవిత్ర పండుగను పురస్కరించుకుని వనపర్తి పట్టణంలోని...

ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషన్ బంజారాపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ఆధ్యాత్మిక శోభతో పోలీసు సురక్ష గణనాథుని నిమజ్జనం జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి 

  – సంప్రదాయబద్ధంగా పోలీసు సురక్ష గణపయ్య లడ్డూ వేలం పాట పెద్ద లడ్డు 61. వేలకు చిన్న లడ్డు 21.వేలం పాట,– భక్తి సంస్కృతి, సంప్రదాయాల నడుమ పోలీసు...
error: Content is protected !!