ePaper
Tuesday, June 16, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంఖమ్మం జిల్లా లొ బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బి ఏ ఎస్) పథకం ద్వారా చదువు...

ఖమ్మం జిల్లా లొ బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బి ఏ ఎస్) పథకం ద్వారా చదువు కుంటున్న విద్యార్థిని విద్యార్ధుల మానసిక క్షోభకు కారణం ఎవరు?

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రభుత్వమా లేక అధికారుల? లేఖ ఈ ఇద్దరి డొల్ల తనాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని విద్యార్ధుల తల్లిదండ్రులను వేధిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థ లదా?

ఈ ప్రశ్నలకు జవాబు ఏది.

విద్యార్ధుల భవిష్యత్తు ఆధారపడివున్న ఒక ప్రభుత్వ పథకాన్ని ఇంతల నీరుకరిస్తారా. పథకం అమలు లో ఏమైనా లోపాలుంటే సరిచేసి అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీదా ఉంది. ఒక వేల ఈ పథకానీ నిలుపు చేయాలని భావిస్తే ముందుగా సమాచారం ఇస్తే ఏదో ఒకటి చూసుకునే వాళ్ళం కదా.

ప్రతి విద్య సంవత్సరం ప్రారంభం లో దీన్ని లేవనెత్తి ఇబ్బంది పెట్టడం ఎందుకు. 

ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి బాగాలేదు దశల వారీగా అన్నింటిని చెల్లిస్తాం అని గతం లోనే చెప్పింది. విద్య సంస్థలు అంగీకరించాయి కూడా. అయినప్పటికీ మళ్లీ మొదటికొచ్చాయి. ఇక్కడ ప్రభుత్వం విద్య సంస్థలు ఒకరికి ఒకరు ఆరోపణలు చేసుకొని విద్యార్దులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సందర్భంగా తల్లిదండులుగా కోరుకునేది ఒక్కటే. 1. బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బిఏఎస్ ) పథకం ను పూర్తిగా తొలగించండి. 2. లేదంటే వాటికి ఫీజులను ఆపకుండా చెల్లించండి. అంతే కానీ చదువు మధ్యలో ఆపేస్తాం అంటే ఊరుకునేది లేదు పిల్లలతో పాటు అందరూ రోడ్లపైకి వస్తారు. జాగ్రత్త!ఇది ప్రభుత్వం మరియు విద్య సంస్థలు గమనించాలి. లేదంటే వారికి రాబోయే రోజుల్లో అదో గతే.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!