ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిదళితుల భూమిలో దౌర్జన్యంగా వేసిన పైప్‌లైన్ తొలగించాలి: ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ డిమాండ్

దళితుల భూమిలో దౌర్జన్యంగా వేసిన పైప్‌లైన్ తొలగించాలి: ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ డిమాండ్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో, జూన్ 19, 2026: వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు రాజనగరంలో దళితుల వ్యవసాయ భూమిలో వారి అనుమతి లేకుండా పైప్‌లైన్ ఏర్పాటు చేసిన ఘటనను వనపర్తి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. రాజనగరం ప్రాంతానికి చెందిన దళిత రైతుల సర్వే నంబర్ 65/ఆ లో, బీసీ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పైప్‌లైన్ ఏర్పాటు చేశారని బాధితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, స్థానిక ప్రజల సమక్షంలో పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాదారి భోజరాజు మాట్లాడుతూ… దళితుల భూమిలో వారి అనుమతి లేకుండా పైప్‌లైన్ వేయడం బాధాకరమని, ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. భూమి యజమానులకు సమాచారం ఇవ్వకుండా వారి పొలంలో పనులు చేపట్టడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. మరో సభ్యుడు ద్యారపోగు వెంకటేష్ మాట్లాడుతూ… దళితులపై ఎలాంటి అన్యాయం, దాడులు జరిగినా సహించబోమని హెచ్చరించారు. దళిత రైతుల భూమిలో దౌర్జన్యంగా వేసిన పైప్‌లైన్‌ను వెంటనే తొలగించి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కమిటీ సభ్యుడు చింతకుంట విశ్వం బాబు మాట్లాడుతూ… దళితులకు ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. స్థానిక పెద్దల సమక్షంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన పైప్‌లైన్ సరైనది కాదని, దానిని వేరే ప్రాంతానికి మార్చాలని సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, కౌన్సిలర్ భర్త నక్క రాజు, మాజీ కౌన్సిలర్ వంగూరు గోపాల్, వార్డు పెద్దలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!