ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తియూరప్ లోని ప్రఖ్యాత ఈఎస్సిపి బిజినెస్ స్కూల్‌లో డ్యుయల్ మాస్టర్ డిగ్రి విజయవంతంగా పూర్తి చేసిన...

యూరప్ లోని ప్రఖ్యాత ఈఎస్సిపి బిజినెస్ స్కూల్‌లో డ్యుయల్ మాస్టర్ డిగ్రి విజయవంతంగా పూర్తి చేసిన తూడి నవనీత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 20 2026: వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తనయుడు నవనీత్ రెడ్డి యూరప్ లోని అత్యంత ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థలో ఏకకాలంలో డ్యూయల్ మాస్టర్ డిగ్రి పూర్తి చేశారు. ఈఎస్సిపి బిజినెస్ స్కూల్ లో విధ్యనభ్యసించిన ఆయన మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ) పట్టాను ప్రాన్స్ లో , మాస్టర్ ఆఫ్ సైన్(ఎం ఎస్ సి) పట్టాను జర్మనీలో పూర్తి చేశారు. రెండు దేశాల్లోని విద్యా ప్రమాణాలను సమర్థవంతంగా అధిగమిస్తూ ఆయన ఈ ఘనత సాధించారు. ఈనెల 19న ప్రాన్స్ లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో నవనీత్ రెడ్డి తల్లిదండ్రులు వనపర్తి ఎమ్మెల్యే మేఘారె్డ్డి-శారద దంపతులు, సోదరుడు మనోజ్ రెడ్డి పాల్గొన్నారు. 1819లో స్థాపించబడిన ఈఎస్సిపి బిజినెస్ స్కూల్ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా గుర్తింపు ఉంది. ఇట్లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో డ్యూయల్ మాస్టర్ డిగ్రి పూర్తి చేయడం ద్వారా నవనీత్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో తన విద్యా ప్రతిభను చాటుకున్నారు. ప్రపంచ స్థాయి విద్యా అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఆకాంక్ష కలిగిన విద్యార్థులకు నవనీత్ రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నరు. ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!