ePaper
Monday, June 22, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంవేంసూరులో గుప్తనిధుల తవ్వకాల కలకలం

వేంసూరులో గుప్తనిధుల తవ్వకాల కలకలం

📰 Generate e-Paper Clip

కుంచపర్తి గ్రామ శివారులోని శివాలయంలో తవ్వకాలతో కలకలం

గుప్తనిధుల కోసం కాదని, శాంతి పూజల కోసం తవ్వకాలు చేపట్టామని స్వామీజీ వివరణ

10 మంది కూలీలు, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 21 2026: ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారనే వార్త ప్రజల్లో కలకలం రేపింది. వివరాల ప్రకారం, వేంసూరు మండలంలోని కుంచపర్తి గ్రామ శివారులో మారెమ్మ గుడి పక్కన ఉన్న శివాలయంలో గుప్తనిధుల కోసం కొన్ని రోజులుగా ఓ స్వామీజీ 10 మంది కూలీలతో తవ్వకాలు జరిపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తవ్వకాల్లో పాల్గొంటున్న కూలీలు ఏన్కూరు మరియు గుంటూరు ప్రాంతాలకు చెందిన వారిగా సమాచారం. “మేము రోజువారీ పని చేసుకునే వాళ్లం. బావి తవ్వాలని చెప్పి స్వామీజీ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. రోజువారీ కూలీ ఇస్తూ, మాకు భోజన వసతి కల్పించి ఇక్కడే ఉండమని చెప్పారు” అని కూలీలు మీడియాకు వెల్లడించారు. అయితే గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపలేదని స్వామీజీ స్పష్టం చేశారు. “గుడిపై నరదృష్టి పడిందని, అభివృద్ధి లేక గుడి వెలవెలబోతుందని, అర్చకులు రావడం లేదని భావించాం. శాంతి పూజ కోసం తవ్వకాలు జరిపి, అందులో శ్రీచక్రం ప్రతిష్ఠించి పూజలు చేయాలని ఉద్దేశంతో ఈ పనులు చేపట్టాం. నాపై దురుద్దేశంతో కొందరు ఇలా పుకార్లు సృష్టిస్తున్నారు” అని ఆయన తెలిపారు. మరోవైపు, స్థానికులకు, గ్రామ పెద్దలకు తెలియజేయకుండా తవ్వకాలు నిర్వహిస్తున్నారని, కచ్చితంగా గుప్తనిధుల కోసమే స్వామీజీ ఈ చర్యలకు పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 10 మంది కూలీలను, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గుప్తనిధుల కోసమే స్వామీజీ ఈ తవ్వకాలు నిర్వహిస్తున్నాడా? గుప్తనిధుల వ్యవహారానికి కూలీలకు ఏమైనా సంబంధం ఉందా? స్వామీజీ, కూలీలు కలిసి గుప్తనిధుల కోసం ఈ చర్యలకు పాల్పడ్డారా? లేదా కూలీలు స్వామీజీ మాటలు నమ్మి అనుకోకుండా ఈ వ్యవహారంలో చిక్కుకున్నారా? అనే కోణాల్లో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!