ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే ఉన్నత స్థానాలకు చేరుకున్నారని సర్పంచ్ వ్యాఖ్య
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 22 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని గంగారం గ్రామ అభివృద్ధి ప్రదాత దాసరి మధుమోహన్ రెడ్డి సూచనల మేరకు, సోమవారం (22-06-2026) గంగారం గ్రామంలోని దాసరి వీరారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని గ్రామ సర్పంచ్ కాకర్ల రేవతి మరియు గ్రామ పెద్దలు తనిఖీ చేశారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థినీ, విద్యార్థులందరినీ మధ్యాహ్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. భోజనం ఏ విధంగా పెడుతున్నారు, నాణ్యత ఎలా ఉంది అనే విషయాలపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులకు భోజనం వడ్డించారు. సర్పంచ్ కాకర్ల రేవతి మరియు గ్రామ పెద్దలు కూడా భోజనం చేసి పరిశీలించారు. భోజనం చాలా బాగుందని తెలిపారు. రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం విద్యార్థులకు అందించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాకర్ల రేవతి మాట్లాడుతూ… గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదివితే చిన్నతనం ఏమీ కాదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు మాత్రమే కాకుండా రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులు, దేశాన్ని పరిపాలించే నాయకులుగా కూడా ఎదిగారని తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అందించాలని తల్లిదండ్రులకు సూచించారు.


