ePaper
Monday, September 14, 2026
📄 ePaper

ఎస్.ఐ.ఆర్. అమలు హేతుబద్ధతలేని విధానాన్ని బిజెపి అమలు చేస్తోంది.

📰 Generate e-Paper Clip

అభివృద్ధి మతం మారినంత మాత్రాన కుల వివక్షత అంతరించదు. 

ఆధార్ ఆధారంగానే ఓట్ల సవరణ చేర్పులు, మార్పులు జరగాలి. 

ఓటు నుండి ప్రారంభించి పౌరసత్వం ప్రశ్నార్థకంగా మార్చే వరకు బిజెపి వెళ్తోంది. 

ఓట్ల స్క్రీనింగ్ పేరిట పౌరసత్వానికి ముప్పు తెస్తున్నారు. 

దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారత ఓటర్లే, పౌరులే అని గుర్తించాలి. 

సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ జూన్ 23 2026: బద్వేలు స్థానిక సిపిఎం కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ “ప్రెస్ మీట్” 2026 జూన్ 23 వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు, నిర్వహించారు. ఈ “ప్రెస్ మీట్” లో ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.చాంద్ బాషా, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.జకరయ్య, చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ రమణ. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆర్.ఓబయ్య పాల్గొన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ… భారతదేశంలో ఎస్.ఎస్.ఆర్. పేరిట గతంలో 8 సార్లు ఓట్ల సవరణ సర్వే జరిగిందని గుర్తు చేశారు. చనిపోయిన వారి ఓట్లను తొలగించడం, నూతన యువతి, యువకులను ఓటర్లుగా చేర్చుకోవడం ఆనవాయితీగా జరుగుతూ వచ్చిందని తెలిపారు. నేడు కేంద్రంలోని నరేంద్ర మోడీ బిజెపి, ఎన్డీఏ, ప్రభుత్వాలు ఎస్.ఐ.ఆర్. పేరిట దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారత ఓటర్లే, దేశ పౌరులే అనే విషయాన్ని మరచి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థి పార్టీల ఓటర్లను తొలగించడం, మైనార్టీలు, దళితుల ఓటర్ల సంఖ్య తొలగించి, కుదించడం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా రాజకీయ పార్టీల గెలుపు, ఓటమిలతో సంబంధం లేకుండా ఓటర్ల నమోదు కార్యక్రమం, సవరణ జరగాలని, దానికి భిన్నంగా నేడు దేశంలో జరుగుతున్నదని పత్రికలు, మీడియా కోడై కూస్తున్న పాలకవర్గాలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలన్నిటిని లోపర్చుకొని బిజెపి చెప్పు చేతల్లో పెట్టుకుంటూ వస్తున్నదని, దానికి అనుగుణంగా పార్లమెంటులో చర్చ జరపకుండా, ప్రజా వ్యతిరేక బిల్లులు పెట్టి, ఆమోదించుకొని చట్టాలు చేస్తున్నారని ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని తెలిపారు. ప్రజలు కట్టే పన్నులతో ప్రభుత్వ సకల ఉద్యోగులు పనిచేస్తున్నారని, ప్రజల కోసం నిష్పక్షపాతంగా విచారణ చేసి పనిచేయాల్సిన వారు పాలకవర్గాలకు ఊడిగం చేయడం రాజ్యాంగ విరుద్ధమైన చర్య అన్నారు. బిజెపి విధానాలు దేశాన్ని ఓపెన్ జైలుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నదని చరిత్రలో ఇలాంటి పద్ధతులు పాటించిన హిట్లర్, ముసోలిని లాంటి నియంతలు పుట్టగతులు లేకుండా చరిత్ర హీనులుగా కనుమరుగయ్యారని బిజెపి కేంద్ర నాయకత్వం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఎస్ ఐ ఆర్ అమలు హేతుబద్ధంగా లేదని ఆరోపించారు. భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ ఉందని, కులం ఆధారంగా వివక్షత ఉందని, వివక్షత ఆధారంగానే, వెనుకపాటు తనాన్ని ఆధారంగానే విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు వచ్చాయని గుర్తు చేశారు. మతం మారినంత మాత్రాన కులం అంతరించదని వారు తెలిపారు. ఆధార ఆధారంగానే ఓట్ల సవరణ చేర్పులు మార్పులు జరగాలని డిమాండ్ చేశారు. ఓటు నుండి ప్రారంభించి పౌరసత్వం ప్రశ్నార్థకంగా మార్చే వరకు బిజెపి వెళుతుందని దీన్ని ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు ఐక్యంగా ఎదుర్కోవాలన్నారు. ఓట్ల స్పీడుంగ్ పేరిట పౌరసత్వానికి ముక్కు చేస్తున్నారని ఆరోపించారు.

Latest Articles

ప్రజా సేవలో 42 వసంతాలు పూర్తి చేసుకున్న రాయప్ప

42 సంవత్సరాల నిస్వార్థ ప్రజా సేవ పూర్తి చేసుకున్న ఎస్సై కొప్పుల...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!