పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి జూన్ 23 2026: అశ్వారావుపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,ఎమ్మెల్సీలు తాత మధుసూదన్, తక్కేళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, వారి మోసపూరిత వాగ్దానాలను ఎండగట్టారు. గడిచిన రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో కేవలం దోపిడీ రాజ్యం, దండుపాళ్యం ముఠా తరహా పాలన మాత్రమే సాగుతోందని, ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు.వృద్ధాప్య పింఛన్లను రూ. 2,000 నుండి రూ. 4,000 కి పెంచుతామన్న మాట ఏమైంది. మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామన్న పథకం ఎటు పోయింది.చదువుకునే ఆడపిల్లలకు ఇస్తామన్న స్కూటర్లు, పెళ్లిళ్లకు ఇస్తామన్న తులం బంగారం హామీలు ఎక్కడ ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా నిబంధనలకు విరుద్ధంగా సీతారామ ప్రాజెక్టు కాలువ మట్టిని, కలపను అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న ప్రతి భూ దందాల్లో, మట్టి, ఇసుక మాఫియాల వెనుక మంత్రులు పాత్ర ఉందని మండిపడ్డారు. బుగ్గపాడు ఫుడ్ పార్కును మార్కెట్ విలువకు విరుద్ధంగా అనుయాయుల ఆంధ్ర కంపెనీకి ఫుడ్ పార్క్ భూములు విక్రయించారని ఆరోపించారు. ప్రజలకు సంక్షేమం అందకపోయినా,ఈ ప్రభుత్వంలోని రెవెన్యూ, వ్యవసాయ శాఖల మంత్రుల ఆదాయాలు మరియు ఆస్తులు మాత్రం వందల ఎకరాలకు పెరిగాయని ఆరోపించారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి, చావు నోట్లోకి వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ దేనని, ఆయన లేకపోతే తెలంగాణలో దోపిడీ మరింత ఎక్కువవుతుందని అన్నారు. తెలంగాణను కాపాడుకోవాలంటే మళ్లీ కేసీఆర్ నాయకత్వం అవసరం.రాబోయే ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గం నుంచే బీఆర్ఎస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయాలి.” ఖమ్మం జిల్లా ప్రజలంతా ఆలోచించి, అసలైన అభివృద్ధిని గుర్తించాలని కోరారు.రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి, కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్లీ ఏర్పాటు చేయడానికి అశ్వారావుపేట నుండే మొదటి సీటును కానుకగా ఇవ్వాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

