ePaper
Monday, September 14, 2026
📄 ePaper

బొగ్గు చోరీల ఆరోపణలు వాస్తవాలకు దూరమని సింగరేణి డైరెక్టర్ స్పష్టం

📰 Generate e-Paper Clip

ప్రతి టన్ను బొగ్గుపై ఆర్‌ఎఫ్‌ఐడీ, జీపీఎస్, సీసీటీవీలతో పర్యవేక్షణ

సింగరేణి 137 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక సంస్థ అని వ్యాఖ్య

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 23 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో జేవియర్ ఓపెన్‌కాస్ట్ సింగరేణి డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మైనింగ్ రంగంలో 137 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక సంస్థ అని తెలిపారు. దేశ ఇంధన భద్రతకు వెన్నెముకగా నిలుస్తూ, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మరియు పారిశ్రామిక వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేస్తూ జాతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇటీవల సింగరేణిలో బొగ్గు మాయమైందని, భారీ స్థాయిలో బొగ్గు చోరీలు జరిగాయని వస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటి ఆరోపణలు సంస్థ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో సింగరేణిలో అమలులో ఉన్న బొగ్గు రవాణా భద్రతా వ్యవస్థలు, సాంకేతిక పర్యవేక్షణ విధానాల గురించి కొన్ని వాస్తవాలను ప్రజలతో పంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

బొగ్గు రవాణా వ్యవస్థ

సింగరేణిలో ఉత్పత్తి అయ్యే బొగ్గులో సుమారు 85 శాతం రైల్వే మార్గం ద్వారా, మిగిలిన 15 శాతం రోడ్డు మార్గం ద్వారా వినియోగదారులకు సరఫరా చేయబడుతుందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తి అయిన క్షణం నుంచి వినియోగదారుడి వద్దకు చేరే వరకు ప్రతి దశలో డిజిటల్ పర్యవేక్షణ, భద్రతా తనిఖీలు, ఆన్‌లైన్ రికార్డింగ్ వ్యవస్థలు అమల్లో ఉంటాయని వివరించారు. రైలు మార్గం ద్వారా బొగ్గు రవాణా ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్ల ప్రకారం విద్యుత్ కేంద్రాలు మరియు ఇతర భారీ వినియోగదారులు సింగరేణిలోని వివిధ సీహెచ్‌పీల నుంచి బొగ్గును స్వీకరిస్తారని తెలిపారు. ప్రతి వ్యాగన్‌కు నిర్దిష్ట పరిమాణంలో బొగ్గు లోడింగ్ జరుగుతుందని, మొత్తం ప్రక్రియ ఎస్‌ఏపీ ఆధారంగా నిర్వహించబడుతుందని చెప్పారు. లోడింగ్ పూర్తయిన వెంటనే వినియోగదారునికి డిజిటల్ సమాచారం అందుతుందని, అనంతరం రైల్వే శాఖ బొగ్గును గమ్యస్థానానికి తరలిస్తుందని వివరించారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నుంచి వినియోగదారుని వరకు ప్రతి టన్ను బొగ్గు ఆర్‌ఎఫ్‌ఐడీ, జీపీఎస్, సీసీటీవీ, కోల్‌నెట్, ఎలక్ట్రానిక్ వెయ్‌బ్రిడ్జిలు, సింగరేణి సెక్యూరిటీ, ఫ్లయింగ్ స్క్వాడ్లు, హోలోగ్రామ్ చలానాలు, టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షణ వంటి బహుళస్థాయి సాంకేతిక భద్రతా వ్యవస్థల మధ్య నిర్వహించబడుతోందని తెలిపారు. అందువల్ల సింగరేణిలో బొగ్గు మాయమవడం లేదా చోరీ జరగడం వంటి ఆరోపణలు అసత్యమని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Latest Articles

ప్రజా సేవలో 42 వసంతాలు పూర్తి చేసుకున్న రాయప్ప

42 సంవత్సరాల నిస్వార్థ ప్రజా సేవ పూర్తి చేసుకున్న ఎస్సై కొప్పుల...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!