ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో మెరిసిన సానే వినోద్ కుమార్ రెడ్డి – ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సత్కారం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జూన్ 25 2026: ఇటీవల థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో నిర్వహించిన అంతర్జాతీయ తైక్వాండో క్రీడా పోటీల్లో వనపర్తి జిల్లాకు చెందిన క్రీడాకారుడు సానే వినోద్ కుమార్ రెడ్డి రెండు బంగారు పతకాలు, ఒక కాంస్య పతకాన్ని సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి మండలం మాజీ ఎంపీపీ సానే కిచ్చారెడ్డి కుమారుడైన సానే వినోద్ కుమార్ రెడ్డి ఈ ఘనత సాధించడం ద్వారా దేశంతో పాటు వనపర్తి జిల్లా, మండలం, గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ఉన్నత విద్యతో పాటు క్రీడలపైనా దృష్టి సారిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాలు మెండుగా ఉంటాయని ఆయన సూచించారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న తన కార్యాలయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, సానే వినోద్ కుమార్ రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందించారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.

Latest Articles

ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రశ్నించే తత్వమే: కుర్రే రాజేంద్ర రెడ్డి

 ​ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా, ప్రభుత్వాల విధానాలను నిశితంగా...

సీనియర్ సిటిజన్ల కోసం.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

*ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మా కుటుంబం అంటే ఏమిటో ప్రజలందరికీ తెలుసు*

*మా పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్న మా సోదరీ, ఆమె భర్త...

కొండా సురేఖకు ఢిల్లీ అధిష్టానం పిలుపు?

  కీలక పదవి ఇవ్వనున్నారనే ప్రచారం.. కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ  పొలిటికల్ పవర్ సమగ్ర...

దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గ్రామపంచాయతీ...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గర్జన11/09/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భూపాలపల్లి నియోజవర్గం...
error: Content is protected !!