ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

తెలంగాణ రైతులకు శుభవార్త.. ఒకేసారి ‘రైతుభరోసా’ నిధులు రిలీజ్‌!

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి తెలంగాణలో వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని ఈసారి రైతుల ఖాతాల్లో ఒకేసారి జమ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలంలో ఈ నెల 30న నిర్వహించనున్న ‘రైతు ఆశీర్వాద సభ’లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ నిధులను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం గురువారం అధికారికంగా మార్గదర్శకాలను (గైడలైన్స్) విడుదల చేసింది. ఈ పథకం కింద ఎకరాకు రూ. 6 వేల చొప్పున, రెండు సీజన్లలో కలిపి మొత్తం రూ. 12 వేల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ వానాకాలం సీజన్‌లో రైతుభరోసా లబ్ధి పొందడానికి ప్రభుత్వం కీలక విధివిధానాలను ఖరారు చేసింది. ఈ నెల 15వ తేదీ నాటికి ‘భూభారతి’ పోర్టల్‌లో భూమి వివరాలు నమోదై, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ (సీ సీ యల్ ఏ) నుంచి అనుమతులు పొందిన రైతులకు మాత్రమే ఈ సాయం అందుతుంది. అలాగే, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ (ఆర్ ఓ ఎఫ్ ఆర్) పట్టాలు కలిగిన గిరిజన రైతులు కూడా ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ నుంచి అనుమతులు పొంది ఉండాలి. అర్హులైన రైతుల రికార్డులను ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని జిల్లా వ్యవసాయాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఒక జిల్లా పరిధిలోనే దాదాపు 3.58 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉండగా, వారి కోసం రూ. 460 కోట్ల నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలో కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన 3,906 మంది రైతులు కూడా ఉన్నారు. మరోవైపు, రాబోయే వ్యవసాయ సీజన్‌కు రాష్ట్రంలో యూరియా కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఇప్పటికే 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలను సిద్ధం చేశామని, మొబైల్ యాప్‌లో బుక్ చేసుకున్న వెంటనే రైతులకు యూరియా అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అలాగే, త్వరలోనే వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రైతులు వాటికి అనుకూలమైన పంటలను సాగు చేయాలని మంత్రి సూచించారు.

Latest Articles

ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా

జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట...

అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతులు ఆగం

  వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాపొలిటికల్ పవర్...

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి:...

తెలంగాణ చరిత్ర ను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బీజేపీ కమలాకర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిసమాజ...

నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

*గంజాయి సరఫరా, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణపై ప్రత్యేక దృష్టి పట్టాలి*పొలిటికల్ పవర్ ప్రతినిధి  ఖమ్మంగంజాయి వినియోగించే అవకాశం ఉన్న నిర్మానుష ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు,...

error: Content is protected !!