– సంప్రదాయబద్ధంగా పోలీసు సురక్ష గణపయ్య లడ్డూ వేలం పాట పెద్ద లడ్డు 61. వేలకు చిన్న లడ్డు 21.వేలం పాట,
– భక్తి సంస్కృతి, సంప్రదాయాల నడుమ పోలీసు సురక్ష గణనాథునికి ఘన వీడ్కోలు, శాంతియుతంగా ఉత్సవాలు నిర్వహించడంలో పోలీసులసమన్వయం అభినందనీయం,
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్. 17. 2026. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వనపర్తి జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలోజిల్లాపోలీసుకార్యాలయంలోనిసాయుధదళపోలీసుకార్యాలయంలోప్రతిష్ఠించినమట్టిగణనాథునినిమజ్జనకార్యక్రమాన్నిభక్తి,సంస్కృతి,సంప్రదాయాలసమ్మేళనంగాఘనంగానిర్వహించారు.మూడురోజులుగాభక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కొలువుదీరిన పోలీసు సురక్ష గణనాథునికిబుధవారం జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి, ఐపీఎస్ ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సంప్రదాయపద్ధతిలోగణనాథునికిపూజలునిర్వహించి,భక్తిశ్రద్ధలతోసమర్పించినలడ్డూనువేలంపాటనిర్వహించారు.వేలంపాటలోపోలీసుఅధికారులు,సిబ్బందిఉత్సాహంగా పాల్గొని పెద్ద లడ్డు 61 వేలకు చిన్న లడ్డు21వేలకుసొంతంచేసుకునిభక్తిభావాన్నిచాటుకున్నారు.అనంతరం భజనలు, బాజాభజంత్రీలు, కోలాటాలు, జై గణేశ్ నినాదాల నడుమ గణనాథుని ఊరేగింపును ఆధ్యాత్మికంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ గారు నిమజ్జనంలో పాల్గొని గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూవిఘ్నాలనుతొలగించేగణనాథుని ఆశీస్సులతోవనపర్తిజిల్లాప్రజలందరూసుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభ్రాతృత్వాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. వినాయక నవరాత్రి ఉత్సవాలుమనసంస్కృతి,సంప్రదాయాలు,ఆధ్యాత్మిక విలువలకు ప్రతీకలు. భక్తితో పాటు బాధ్యత, క్రమశిక్షణ, పరస్పర సహకారం కలిగి ఉత్సవాలను నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజల భక్తి భావాలనుగౌరవిస్తూ,ఉత్సవాలుప్రశాంతంగా,సురక్షితంగా జరిగేలా పోలీసుశాఖ నిరంతరం కృషి చేస్తుంది. ప్రజలు కూడా పోలీసుశాఖకు సహకరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలి. ప్రజల భద్రత, శాంతి, సౌభ్రాతృత్వమే పోలీసుశాఖకు అత్యంత ప్రాధాన్యతని భక్తి, సంప్రదాయం, పోలీసు ఐక్యతకు ప్రతీకగా . సంప్రదాయ కళారూపాలు, భక్తి గీతాలు, కోలాటాలతో ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణంలో గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించామని ఎస్పీ తెలిపారూ.ఈ కార్యక్రమంలో వనపర్తి డీఎస్పీ గిరిబాబు, జిల్లా పోలీసు కార్యాలయం ఏ ఓ, సునంద, వనపర్తి సీఐ, సుగంధరత్నం, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్,స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు మంజునాథ్ రెడ్డి, పర్వతాలు, నరేష్, వనపర్తి పట్టణ ఎస్సై హరిప్రసాద్, వనపర్తి రూరల్ ఎస్సై, హృషికేష్, అమరచింత ఎస్సై, స్వాతి, రేవల్లి ఎస్సై, రజిత శ్రీరంగాపూర్ ఎస్సై,హిమబిందు,రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్లు వినోద్, మగ్దూం బారీ, ట్రాఫిక్ ఎస్సై సురేందర్, పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


