ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంనకిలీ పోలీసులుగా బెదిరించి కోట్ల రూపాయల ఎరతో దోపిడీలు.

నకిలీ పోలీసులుగా బెదిరించి కోట్ల రూపాయల ఎరతో దోపిడీలు.

📰 Generate e-Paper Clip

గంగారంలో డెకాయిటీ కేసు ఛేదించిన సత్తుపల్లి పోలీసులు.. 12 మంది అరెస్ట్

గంగారం డెకాయిటీ కేసులో 12 మంది నిందితుల అరెస్ట్.. ఇద్దరు పరారీలో.

రూ.17.60 లక్షల నగదు, 3 కార్లు, స్కూటీ, 16 సెల్‌ఫోన్లు, పోలీస్ యూనిఫాంల స్వాధీనం.

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి జులై 02 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో గురువారం ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీహరి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నేరస్తుల కోసం గాలింపు చేపట్టగా, గంగారం గ్రామంలో నేరం జరిగిన ప్రదేశంలోనే నిందితులు ఉన్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. డెకాయిటీ (బెదిరించి బలవంతంగా చేసే దోపిడీ) కేసులో బాధితుడు కుర్రా గంగాధర్ రెడ్డి, తండ్రి గంగిరెడ్డి, నివాసం పొద్దుటూరు, కడప జిల్లా ఇచ్చిన ఫిర్యాదు మేరకు 25-06-2026న నమోదు చేసిన కేసులో మొత్తం 12 మంది నిందితులను (A1 నుంచి A12 వరకు) అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. A13, A14 నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని వెల్లడించారు.

నేర విధానం ముద్దాయిలు ఒప్పుకున్న వివరాల ప్రకారం…

అమాయకులను మోసం చేసి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వివిధ సిమ్ కార్డులను ఉపయోగించి ఫోన్ కాల్స్ చేసేవారు. ఫోన్ ఎత్తిన వారికి తమ పేర్లు మహేందర్ రెడ్డి, బాలగంగాధర్ చంద్రం, చంటి బాబు వంటి పేర్లతో పరిచయం చేసుకుని, తాము రియల్ ఎస్టేట్ వ్యాపారులమని, తమ వద్ద రూ.2 కోట్ల బ్లాక్ మనీ ఉందని, దానిని వైట్ మనీగా మార్చుకోవాల్సి ఉందని నమ్మించేవారు. వారు ఇచ్చే డబ్బుకు నాలుగు రెట్లు తిరిగి ఇస్తామని, రూ.10 లక్షలు ఇస్తే రూ.40 లక్షలు ఖాతాలో జమ చేస్తామని చెప్పి బాధితులను నమ్మించి, నిర్ణయించిన ప్రదేశానికి డబ్బుతో రప్పించేవారు. అక్కడ తమ వ్యక్తి ద్వారా డమ్మీ కరెన్సీ నోట్లతో ఉన్న బ్యాగ్ చూపించి, బాధితుల నుంచి అసలు నగదు తీసుకునే సమయంలో ముందుగానే సిద్ధంగా ఉన్న నకిలీ పోలీసులు అక్కడికి చేరుకుని, దొంగనోట్ల వ్యాపారం చేస్తున్నారని లేదా మోస్ట్ వాంటెడ్ నేరస్థులని బెదిరించి, అవసరమైతే వారిని, తమ వ్యక్తినే కూడా కొట్టి అనుమానం రాకుండా చేసి నగదును దోచుకుని పరారయ్యేవారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో గంగారం ప్రాంతంలో టీజీఎస్పీ 15వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ ముళ్లగిరి వర్దన్ (A2), ఆర్‌ఎస్‌ఐ బేరా కేశవరావు (A4) కూడా నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు

రూ.17,60,000 నగదు (పదిహేడు లక్షల అరవై వేల రూపాయలు) 2 ఇన్నోవా కార్లు , 1 ఎర్టిగా కారు , 1 టీవీఎస్ యాక్సెస్ స్కూటీ , 16 సెల్‌ఫోన్లు , 2 పోలీస్ యూనిఫాంలు , 1 హ్యాండ్‌కఫ్ , 1 ఎస్‌ఐ యూనిఫాం సెట్ , 1 ఆర్‌ఎస్‌ఐ యూనిఫాం సెట్ , 2 పోలీస్ పేరుతో ఉన్న తెలుపు టీ-షర్టులు , 2 పోలీస్ రైన్‌కోట్లు రూ.500 డమ్మీ “చిల్డ్రన్ బ్యాంక్” కరెన్సీ నోట్లతో కూడిన 80 బండిల్లు (ప్రతి బండిల్‌లో 100 నోట్లు) వీటన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ శ్రీహరి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!