పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక/ పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లోని ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీసు వారు ఒక దళిత యువకుడ్ని తీసుకువచ్చి నువ్వు దొంగతనం కేసు ఒప్పుకోవాలి లేదంటే నిన్ను మీ ఇద్దరు పిల్లల్ని నీ భార్యని కూడా ఎఫ్ఐఆర్లో చేరుస్తాము అని రూరల్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ రాయుడు దళిత యువకుడ్ని భయభ్రాంతులకు గురి చేస్తూ 15 రోజుల నుంచి తన కారు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టుకొని నువ్వు రాత్రిపూట కార్లో తిరుగుతూ దొంగతనాలు చేస్తున్నావని ఎటువంటి ఆధారాలు లేకుండా పోలీసు వారు ప్రవర్తిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది బాధితుడు తనను మానసికంగా హింసిస్తూ యువకుని కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఒప్పుకోవాలి లేదంటే నిన్ను ఎన్కౌంటర్ చేస్తామని ఎస్సై బెదిరిస్తున్నట్టు బొగట్ట దళిత యువకుడివి నీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాను నిన్ను కాపాడటానికి ఎవరు వస్తారో చూస్తామంటూ ఎస్ఐ బెదిరిస్తున్నారు అని బాధితుడు వాపోయారు సార్ నాకు ఏ పాపం తెలియదు నేను అట్లాంటి తప్పు చేసే వాడిని కాదు నేను ఎంసీఏ చదువుకున్నాను ఏదో బతకడానికి కిరాణా షాప్ పెట్టుకున్నాను నన్ను వదిలేయండి సార్ అని బాధితుడు పలుమార్లు ప్రాదేయపడ్డ కూడా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై వదిలిపెట్టకుండా అతని మీద దొంగ కేసులు బనాయించాలని దొంగ కేసులు ఎఫ్ ఐ ఆర్ చేయాలని చూస్తున్నారు అసలు రోజూ దొంగతనాలు చేసి బయట తిరిగే దొంగల్ని పట్టుకోకుండా ఇలాంటి అమాయకులను పోలీసు వారు బలి చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది పోలీస్ వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము బాధితుడు నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్ నేను నా భార్య నా కుటుంబ సభ్యులకు నేనే ఆధారం సార్ నన్ను వదిలేయండి సార్ నేను తప్పుడు మనిషిని కాదు తప్పుడు పనులు చేసే వాడిని కాదు సార్ అన్నా కూడా వదిలిపెట్టకుండా 20 రోజుల నుంచి రోజు పోలీస్ స్టేషన్ కు పిలుస్తూ అతనిని మానసికంగా వేధిస్తూ బెదిరిస్తున్నారని ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే అవకాశం లేదు అంటూ బాధితుడు తెలియజేశాడు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివి జరగటం అనేది తెలంగాణ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్ననే ఒక దళిత యువకుడు సిఐ నన్ను హింసిస్తున్నాడు బెదిరిస్తున్నాడు బాధపెడుతున్నాడని వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు ఈమధ్య ఇలాంటివి ఎందుకు ఎస్సీ దళితుల మీదనే జరుగుతున్నాయి అగ్రకులాలు బీసీలు కులానికి చెందిన వ్యక్తులను అయితే అలాగే రోజు పోలీస్ స్టేషన్ కి పిలుస్తారా ఓసీల మీద జరగవా ఓసీలకు ఎవరో ఒకరు రాజకీయ నాయకులు అండదండలు ఉంటాయి కాబట్టి వాళ్ళని పోలీసు వారు ఏమీ అనరా అంటే దళితులు అంటే అంత చులకన దీనిమీద ఖమ్మం జిల్లా సీపీ. ఖమ్మం రూరల్ ఏసీపీ.దృష్టి పెట్టి ఇలా ఎస్సీ మాదిగ కులానికి చెందిన దళితుల మీద తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్న ఎస్ఐలను పోలీస్ అధికారులను వెంటనే ఖమ్మం సీపీ ఆఫీస్ కి అటాచ్ చేయాలని శాఖా పరమైన చర్యలు ఆ ఎస్ఐపై తీసుకోవాలి అని కుల సంఘాల నాయకులు కోరుకుంటున్నారు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి దళిత యువకులను బాగా చదువుకున్న వారిని ఊర్లో రాజకీయ కక్షలు నేపథ్యంగా రాజకీయ నాయకులు చెప్పే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు గురి చేసే పోలీసు వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డిజిపిని బాధితులు కోరుకుంటున్నారు కొస మెరుపు ఏంటంటే దళితులకు ఒక న్యాయం మిగతా కులాలకు న్యాయమా పోలీస్ స్టేషన్లో పలాన కులానికి అయితేనే మేము న్యాయం చేస్తాము ఎస్సీ కులానికి చెందిన వారిని అయితే మేము ఎన్కౌంటర్ చేస్తాము లాక్ అప్ డెత్ లు చేస్తాము అని పోలీస్ స్టేషన్లో బోర్డులు తగిలిస్తే బాగుంటుంది ఎందుకో భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో కానీ ఎక్కడైనా సరే దళితుల మీదనే ఎందుకిలా దాడులు జరుగుతాయి దళితులను మాత్రమే ఎందుకు ఎన్కౌంటర్ చేస్తారు దళితులను మాత్రమే ఎందుకు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు గురిచేస్తోంది పోలీస్ వ్యవస్థలో రాజ్యాంగంలో ఇలా దళితులను అయితేనే కేసులు పెట్టాలని రాసి ఉందా అనేది ఎవరికీ తెలియని ప్రశ్న ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి పదేపదే నేను సీఎం కావటానికి రాజకీయాల్లో ఇంత సక్సెస్ కావటానికి మాదిగలు దళితులే నాకు సాయం చేశారని పదేపదే మీటింగ్లో చెప్పడం కోస మేరుపు
ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లోని ఎస్సై రాయుడు అరాచకాలు
RELATED ARTICLES
