ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

ముందస్తు అరెస్టులను ఖండించిన బీజేపీ నాయకులు 

📰 Generate e-Paper Clip

బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ భూముల వ్యవహారంపై బీజేపీ నిరసన కార్యక్రమానికి పిలుపు.

బుగ్గపాడు ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం.

పొలిటికల్ పవర్ దినపత్రిక / పిఎన్9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి జులై 04 2026: ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఆదేశాల మేరకు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని బుగ్గపాడు గ్రామంలో మెగా ఫుడ్ పార్క్ పేరుతో జరిగినట్లు ఆరోపణలు ఉన్న భూముల అక్రమ కేటాయింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు మాట్లాడుతూ… ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు బీజేపీ నాయకులను వివిధ మండల కేంద్రాల్లో ముందస్తుగా అరెస్టు చేసి నిర్బంధించడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష గొంతును అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల ఆస్తులను, రైతుల హక్కులను కాపాడేందుకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. అక్రమ భూ కేటాయింపులపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముందస్తు అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని, బుగ్గపాడు ప్రజలకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని నాయుడు రాఘవరావు స్పష్టం చేశారు.

Latest Articles

టిపిసిసి ఎస్సి సెల్ కమిటీ రద్దు పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ...

అప్రకటిత విద్యుత్ కోతలపై రైతుల ధర్నా……

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9...

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

-పెద్దమందడి డిప్యూటీ తహసీల్దార్ గౌస్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక...

టివి 9 లో లోకేష్ పాగా

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధువంతం గా ఎదుర్కొంటాం

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటాం*పొలిటికల్ పవర్...

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ డప్పు ధర్నా

దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా బీఆర్ఎస్ వ్యవహరించిందని ఆరోపణపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!