ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణఅశ్వారావుపేటమానవత్వం చాటుకున్న సర్పంచ్ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం*

మానవత్వం చాటుకున్న సర్పంచ్ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం*

📰 Generate e-Paper Clip

*అశ్వారావుపేట పొలిటికల్ పవర్ న్యూస్ ( ఆర్సి కారం వెంకటేష్ ) జులై 11:* ములకలపల్లి మండలంలోని
పోగల్లపల్లి పంచాయితీ పరిధిలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన తుమ్మల ముత్యం అనే వృద్ధురాలు హఠాన్మరణం చెందారు. ఆమె మరణవార్త విన్న వెంటనే స్థానిక సర్పంచ్ మడకం రవి మానవత్వంతో స్పందించారు.
సమాచారం తెలిసిన వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్, వారిని ఓదార్చి కొండంత అండగా నిలిచారు. ఈ కష్టసమయంలో వారి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం తన వంతు సహాయంగా రూ. 1,500/- (పదిహేను వందల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.
విపత్కర పరిస్థితుల్లో తక్షణమే స్పందించి, ఆర్థికంగా అండగా నిలిచిన సర్పంచ్ మడకం రవి ఉదార స్వభావాన్ని మరియు మంచి మనసును గ్రామ ప్రజలు, స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాయం నరసింహారావు,వేలకం రాము, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!