పొలిటికల్ర్ పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి, జులై 11:
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) మాజీ అధ్యక్షుడు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జి.ఎస్.రావు మృతి పట్ల అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న జి.ఎస్.రావు కన్నుమూయడం బాధాకరమని పేర్కొన్నారు.
ప్రజా జీవితంలో జి.ఎస్.రావు చేసిన సేవలు, రాజకీయ రంగంలో ఆయనకు ఉన్న విశిష్ట అనుభవం చిరస్మరణీయమని తెలిపారు. ఆయన మృతి రాజకీయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.
జి.ఎస్.రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించిన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
