ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణప్రతిభావంతురాలైన గిరిజన ఆదివాసీ ** *దివ్యాంగ* *విద్యార్థినికి వైరా* *గురుకులంలో అన్యాయం*

ప్రతిభావంతురాలైన గిరిజన ఆదివాసీ ** *దివ్యాంగ* *విద్యార్థినికి వైరా* *గురుకులంలో అన్యాయం*

📰 Generate e-Paper Clip


పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ అశ్వరావుపేట నియోజకవర్గం రిపోర్టర్ కారం వెంకటేష్
తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి…

@సీఎంఓతెలంగాణ

​ఎస్సెస్సీ పరీక్షల్లో 505 మార్కులు సాధించి, తన ప్రతిభను చాటుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గిరిజన దివ్యాంగ విద్యార్థిని కారం విద్యా శరణ్యకు వైరా గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో అడ్మిషన్ నిరాకరించడం అత్యంత విచారకరం, అన్యాయం.
​ఎడమ చేయి పక్షవాతంతో బాధపడుతున్నప్పటికీ, నిరుపేద కుటుంబం నుండి వచ్చిన శరణ్య సాధించిన విజయం ఎందరికో ఆదర్శం. మెరిట్ ప్రాతిపదికన వైరా గురుకులంలో సీటు కేటాయించినప్పటికీ, “హాస్టల్‌లో తగిన వసతులు లేవు” అనే కుంటిసాకుతో ప్రిన్సిపాల్ అడ్మిషన్ నిరాకరించడం దివ్యాంగుల హక్కుల చట్టం (RPwD Act, 2016) ఉల్లంఘనే అవుతుంది.

​అధికారులు హామీలు ఇచ్చినా, అవి కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆ నిరుపేద విద్యార్థినికి తక్షణమే న్యాయం జరగాలి.

​గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, శరణ్యకు వైరా గురుకులంలో అడ్మిషన్ దక్కేలా చూడాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాము. ఆదివాసి సంఘాలు విద్యార్థి సంఘాలు మానవతావాదులు అందరూ ఈ విషయం మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాము

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!