ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeతెలంగాణ*ఘనంగా అద్విత గ్రాండ్ హోటల్ ప్రారంభం*

*ఘనంగా అద్విత గ్రాండ్ హోటల్ ప్రారంభం*

📰 Generate e-Paper Clip

*ఘనంగా అద్విత గ్రాండ్ హోటల్ ప్రారంభం*

16 జూలై 2026. ఎన్విఆర్ న్యూస్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్ . పొలిటికల్ పవర్ ములుగు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అద్విత గ్రాండ్ హోటల్ బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జయ శంకర్ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి,
ములుగు నియోజకవర్గ ఇంచార్జ్,, మాజీ జడ్పీ చైర్మన్ శ్రీమతి *బడే నాగజ్యోతి- జగదీష్*,రాష్ట్ర అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదేం వీరయ్య, మాజీ రెడ్కో చైర్మన్, వై సతీష్ రెడ్డి, తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్, ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోటల్ యజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారంలో అభివృద్ధి సాధించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఆధునిక సౌకర్యాలతో రూపొందించిన అద్విత గ్రాండ్ హోటల్‌లో లగ్జరీ రూమ్స్, సెంట్రల్ ఏసీ, లిఫ్ట్ సౌకర్యంతో పాటు కుటుంబాలకు అనువైన ఆహ్లాదకరమైన వసతి కల్పించబడింది.

అలాగే ప్రతిరోజూ ఉదయం రుచికరమైన టిఫిన్స్, సౌత్ ఇండియన్ & నార్త్ ఇండియన్ నోరూరించే వంటకాలు, పరిశుభ్రమైన వాతావరణంలో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని హోటల్ యాజమాన్యం తెలిపింది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు, రమేష్ రెడ్డి, వేణు యాదవ్, సునీల్ కుమార్, మల్లయ్య,నర్సింహా నాయక్, ములుగు మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మాజీ, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు,, కార్యకర్తలు, హోటల్ యాజమాన్యం, వ్యాపారవేత్తలు పాల్గొని హోటల్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!