ePaper
Saturday, October 31, 2026
📄 ePaper

భారీ వర్షాల నేపథ్యంలో డోంగ్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -తహసిల్దార్ రంజిత్ కుమార్ విజ్ఞప్తి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి మండలంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఈ నేపథ్యంలో డోంగ్లి మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ రంజిత్ కుమార్ కోరారు. వాతావరణ శాఖ మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగుతాయని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో,ప్రజల భద్రత దృష్ట్యా ఈ విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాలు, వాగుల వద్ద నివసించే ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు,అనవసర ప్రయాణాలు చేయకుండా, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని తెలిపారు. మండల యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని తహసిల్దార్ రంజిత్ కుమార్ పేర్కొన్నారు,ప్రజలెవరూ భయాందోళనకు గురికావద్దని, అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, అధికారులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు.

Latest Articles

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పెనుమూలిలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం

 దుగ్గిరాల: పొలిటికల్ పవర్ ప్రతినిధి  నాగరాజు రెడ్డినాటి జగనన్న ప్రభుత్వ సంక్షేమ...

కళాకారులను కాపాదుకుందాం -పలుస శంకర్ గౌడ్

కళాకారుడు జయరామ్ ను పరామర్శించిన సాహితీ కళా వేదిక సభ్యులు పొలిటికల్ పవర్...

వర్ని మహిళా సంఘాల నిధుల వ్యవహారంలో ఆర్టీఐ పోరాటం సక్సెస్

రూ.1.29 లక్షలు రికవరీ.. ఇంకా రూ.3 లక్షలు రావాల్సిందే! బాధ్యులపై చర్యలు తీసుకోవాలి...

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సమరశంఖం

హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలి టీయూడబ్ల్యూజే,ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి...

నారాయణ పాఠశాలలో ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

Related Articles

💠 _*జీ.వో 59 ద‌ర‌ఖాస్తుదారుల‌కు శుభ‌వార్త‌*_ 💠 _*500 చదరపు గజాలలోపు పెండింగ్ దరఖాస్తులకు నెల రోజుల్లో పరిష్కారం*_ 💠 _*22ఎ పై శ‌ర‌వేగంగా ముఖ్య‌మంత్రి  హామీలు అమలు*_

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  గ‌త నెల...

* టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల యూనియన్ ఎన్నికల సందర్భంగా జూమ్ మీటింగ్

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్  టివి  తెలంగాణ స్టేట్ న్యూస్టి జి ఎస్ ఆర్ టి సి యూనియన్ ఎన్నికలు సందర్భం  గురువారం జూమ్...

పార్టీ కోసం పనిచేసే నాయకుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక భరోసా ప్రమాదవశాత్తు మృతి చెందిన పార్టీ కమిటీ సభ్యుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అక్టోబర్ 1, 2026 నుంచి...

 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* తాడేపల్లి, సెప్టెంబర్ 30: పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు,...
error: Content is protected !!