
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి
కనిగిరి హిల్స్: మిషన్ భగీరథలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమగ్ర వివరాల సేకరణ కార్యక్రమం కనిగిరి హిల్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల వ్యక్తిగత వివరాలు, విధుల స్వరూపం, పనిచేస్తున్న ప్రాంతం, నియామక సంస్థ, వేతనాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు నమోదు చేశారు.
భవిష్యత్తులో కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, పరిపాలనా అవసరాలు మరియు ప్రభుత్వ నిర్ణయాలకు అవసరమైన ఖచ్చితమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఈ డేటా సేకరణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
కార్యక్రమంలో మిషన్ భగీరథ జూనియర్ ఇంజనీర్ (జె ఈ ) వీరబాబు , ఎన్సీసీ మేనేజర్ యుగంధర్ , మిషన్ భగీరథ ఐఎన్టీయూసీ యూనియన్ కార్యదర్శి బాలకృష్ణ , మిషన్ భగీరథ సబ్‌స్టేషన్ ఆపరేటర్ అసోసియేషన్ అధ్యక్షుడు తగరం శ్రీకాంత్ పాల్గొన్నారు. కార్మికుల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలిస్తూ, ప్రతి కార్మికుడి సమాచారం పూర్తిగా, ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.
