ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సఖి మహిళా మండలి భారీ నిరసన కార్యక్రమం

సఖి మహిళా మండలి భారీ నిరసన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అమరవీరుల స్థూపం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది*

*సఖి మహిళా మండలి నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తండ్రిని కోల్పోయి తల్లి రెక్కల కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్న 14 ఏళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు దారుణానికి పాల్పడ్డారు. బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ప్రేమ పేరుతో వంచించి ఒకడు లైంగిక దోపిడీకి పాల్పడగా, ఈ విషయం నలుగురికి చెబుతామని బెదిరించి మరో ఇద్దరూ అత్యాచారానికి పాల్పడిన ప్రకటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని అరెస్టు చేయగా ఇద్దరు పరారీలో ఉన్నారు*

*ప్రేమ పేరుతో ఒకరు భయపెట్టి మరో ఇద్దరు*

*బాలికపై ముగ్గురు యువకుల లైంగిక దాడి*

*భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెంలో అమానవీయ సంఘటన*

*నిందితుల్లో ఆటో డ్రైవర్లు ఒక కానిస్టేబుల్*

*నలుగురి అరెస్ట్-పరారీలో ఇద్దరు*

*ఒకరి తర్వాత మరొకరు, అమాయక బాలికను వంచించిన ముగ్గురు*

*సఖి మహిళా మండలి చైర్మన్ నరాల సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు ఆగాలంటే పార్లమెంటులో చట్టాలు తీసుకురావాలని కోరారు*

*ఈ సందర్భంగా నరాల సత్యనారాయణ మాట్లాడుతూ త్వరలోనే ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహిస్తామని అనంతరం కేంద్ర మంత్రులను కలుస్తామని తెలియజేశారు*

*అదేవిధంగా భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ను కోరుతామని, హోం శాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరి పార్లమెంటులో బలమైన చట్టాలు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని, మహిళలపై మానభంగానికి పాల్పడితే ఫారెన్ లో ఉరి తీసే విధంగా భారత దేశంలో కూడా చట్టాలు రావాలని ఆ చట్టాలు తెచ్చే విధంగా సఖి మహిళా మండలి పోరాడుతుందని నరాల సత్యనారాయణ తెలియజేశారు*

*ఈ కార్యక్రమంలో సఖి మహిళా మండలి సోదరీమణులు కుంజా రమాదేవి, కొమరంసత్య వతి, కారం రామమ్మ, తు స్టి లక్ష్మి, కొమరం నిర్మల, మౌనిక, నూ ప పార్వతి, నూప రాదా, స్వప్న, తోడం సీత, దుర్గ, జ్యోతి, పద్మ, మీడియం రంజిత, పోడియం స్వాతి, వాసం లక్ష్మి, రమణ, జ్యోతి మౌనిక, మీడియం రంజిత, మీడియం శాంతి, కారం ప్రియాంక, సోడి రమణ, తదితర 60 మంది సోదరిమణులు పాల్గొన్నారు*

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!