ePaper
Monday, September 14, 2026
📄 ePaper

ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం పంపిణీ

📰 Generate e-Paper Clip

హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాగి ఇడ్లీ, సాంబారు అందజేత

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జులై 27 2026: బోనకల్ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు వారి పోషకాహార స్థాయిని మెరుగుపరిచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అల్పాహారంగా రాగి ఇడ్లీ, సాంబారు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బోనకల్ ఉప సర్పంచ్ బాణావత్ కొండ, గ్రామపంచాయతీ సిబ్బంది, కళాశాల ప్రిన్సిపల్ నళిని శ్రీ పాల్గొని విద్యార్థులకు స్వయంగా అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విద్యార్థులకు సమతుల్యమైన పౌష్టికాహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక వికాసానికి తోడ్పాటు లభిస్తుందని తెలిపారు. రాగి వంటి పోషక విలువలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను అందించడం వల్ల విద్యార్థుల్లో ఆరోగ్యం మెరుగుపడి, చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం మరియు హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కళాశాలలో ఇలాంటి పౌష్టికాహార కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జోనతాన్ బాబు, రాజేంద్ర కుమార్, లక్ష్మీకాంతం పద్మావతి, రామకృష్ణ, రమేష్, రాజేంద్ర, తిరుపతి రావు, ప్రియ కుమార్ రెడ్డి, మురళీకృష్ణ, యశోద, శాంతి ప్రియ, లైబ్రరీన్ మోహన్, యుడిసి మదర్ సాహెబ్, జశ్వంత్, బుజ్జమ్మ, అరుణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Latest Articles

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా గన్నమనేని కిరణ్ కుమార్ 

  తెలంగాణ రాష్ట్రం తరుపున బిసిఐ ప్రతి నిధిగా సేవలు అందించ బోతున్న...

గణేష్ చతురుద్ది వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి

  పట్టణ, మండల ప్రజలకు జూపల్లి దంపతుల శుభాకాంక్షలు మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!