ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డియాదవ్ద్వారకామాయిలో ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవాలు

యాదవ్ద్వారకామాయిలో ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవాలు

📰 Generate e-Paper Clip

108 లీటర్ల పాలతో సాయిబాబాకు అభిషేకం.. వైభవంగా పల్లకి సేవ

పొలిటికల్ పవర్ తెలుగు జాతీయ దినపత్రిక తెలంగాణ స్టేట్ క్రైమ్ బ్యూరో మహేందర్ యాదవ్ ​మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరి విష్ణుపురి కాలనీలోని ద్వారకామాయి ఆలయంలో గురుపౌర్ణమి మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ షిర్డీ సాయిబాబాకు ఆలయ ట్రస్ట్ సభ్యులు 108 లీటర్ల పాలతో శోభాయమానంగా పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ, అర్చన పూజలు చేపట్టారు. ​మధ్యాహ్న హారతి అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం వేళ బాబావారి పల్లకి సేవను పురవీధుల్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కాలనీవాసులు, సాయిభక్తులు విశేష సంఖ్యలో పాల్గొని బాబావారి దర్శనం చేసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!