పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ డెస్క్: హైదరాబాద్ కులం పేరుతో దూషించినందుకు 11 సంవత్సరాలు జైలు శిక్ష తప్పు చేస్తే కాలం వెంటాడుతుందనే దానికి ఈ తీర్పు ఒక ఉదాహరణ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ తీర్పుతో 13 ఏళ్ల క్రితం జరిగిన ఒక అమానవీయ సంఘటనకు కోర్టు తీర్పు ద్వారా బాధితులకు న్యాయం జరిగిందని నల్గొండ జిల్లా ఎస్పీ తెలియజేయడం హర్షించదగ్గ విషయం నల్గొండ జిల్లాలో ప్రేమ పేరుతో ఎస్సీ ఎస్టీలకు చెందిన యువతని అవమానించి కుల వివక్షకు గురిచేసిన ఈ సంఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర కేసు పూర్వపరాలను తెలియజేస్తూ 2013లో చందంపేట మండలం గన్నేరులపల్లి చెందిన నక్క పర్వతాలు డిండి మండలానికి చెందిన ఒక యువతిని పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి నక్క పర్వతాలు మరియు అతని అత్త నీలం సత్తమ్మ కలిసి ఆ యువతని కులం పేరుతో దూషిస్తూ పెళ్లికి నిరాకరించారు. సుదీర్ఘ విచారణ అనంతరం శిక్షలు ఖరారు చేసిన పలు సెక్షన్ల కింద 11 సంవత్సరాల జైలు మరియు 5000 జరిమానా శిక్ష విధించిన కోర్టు ఈ కేసులో మరో ముద్దాయి నీలం సత్తెమ్మ కు ఐదు సంవత్సరాల కట్టిన కారాగార శిక్ష మరియు 3000 రూపాయలు జరిమానా 3000 రూపాయల కట్టను పక్షంలో మూడు నెలల జైలు ఏకకాలంలో ఈ శిక్షలన్నీ అమలైతాయని కోర్టు తెలియజేసింది ఇది ఇలా ఉండగా బాధితురాలు కి న్యాయం జరిగే లాగా చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహ మరియు స్టేషన్ ఎస్ఐ పోలీస్ సిబ్బందిని పలువురు అభినందించారు.

