ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeతెలంగాణగురు పౌర్ణమి సందర్భంగా బీజేపీ ఎండోమెంట్ (ధార్మిక సెల్) ఆధ్వర్యంలో గురుపూజోత్సవం

గురు పౌర్ణమి సందర్భంగా బీజేపీ ఎండోమెంట్ (ధార్మిక సెల్) ఆధ్వర్యంలో గురుపూజోత్సవం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై 31 2026: గురు పౌర్ణమి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎండోమెంట్ (ధార్మిక సెల్) ఆధ్వర్యంలో శుక్రవారం వనపర్తి పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో ఘనంగా గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎండోమెంట్ రాష్ట్ర కో-కన్వీనర్ స్వాతి రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన జగద్గురు ఆదిశంకరాచార్య వేద విద్యాశ్రమం గురువుగారు లవ కుమార్ ఆచార్యులు, శ్రీ గురు ప్రజాపతి వైదిక స్మార్తాగమ పాఠశాల గురువుగారు హిమవంత్ ఆచార్యులు, రిటైర్డ్ ఎంఈఓ లక్ష్మణ్, రిటైర్డ్ ఉపాధ్యాయురాలు వనజాదేవి, డబ్ల్యూసీసీఎం ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డి, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం మాజీ అధ్యక్షులు చెన్నయ్యలను భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా శాలువాలతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా గురువుల సేవలు సమాజ నిర్మాణంలో అత్యంత కీలకమని, భారతీయ సంస్కృతిలో గురువుకు ఉన్న స్థానం అత్యున్నతమని వక్తలు పేర్కొన్నారు. గురుపౌర్ణమి సందర్భంగా గురువులను సన్మానించడం ఆనవాయితీ మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతికి ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భాషెట్టి శ్రీనివాసులు, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అలివేలమ్మ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కవిత, యువమోర్చా రాష్ట్ర నాయకులు కదిరె మధు, యువమోర్చా జిల్లా అధ్యక్షులు నల్లవోతుల అరవింద్, ఎండోమెంట్ సెల్ జిల్లా కో-కన్వీనర్ విజయ్ కుమార్ చారి, వనపర్తి బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి దంతోజు నవీన్, యువమోర్చా నాయకులు చంద్రశేఖర్, నవీన్, వేద పాఠశాల విద్యార్థులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!