ఈ రోడ్డుపై నరకం చూస్తున్న విద్యార్థులు.
మంత్రి శంకుస్థాపనలు గాలికి వదిలేయడమేనా..?

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి అభివృద్ధి అంటే శంకుస్థాపనల పేర్లతో కాలయాపన చేయడమేనా.? రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుదాం..! అంటే ఇదేనేమో..! ఆదర్శం అంటే కంటికి కనిపించనంత దూరం ఉంటుందా..? ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాపురం అంబేద్కర్ విగ్రహం నుండి గొల్లగూడెం వయా ఆదిత్య నగర్, బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి 02/07/2025 సంవత్సర కాలం పూర్తయిన ఇంకా ఈ రోడ్డు పనులు పూర్తికాలేదు, అనడం కంటే మొదలవలేదు బెట్రేమో..? గొల్లగూడెం నుండి మరియు ఆదిత్య నగర్ కార్తికేయ టౌన్షిప్ నుండి నందనవనం నుండి ఈ రోడ్డు మీదుగా జిల్లా పరిషత్ హై స్కూల్ కి విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాకాలం కావడంతో ఈ రోడ్లు అయినా నడుస్తున్న విద్యార్థులు నడవాలంటేనే ఇబ్బందికరంగా మారింది. ఒకవేళ ఈ రోడ్డు కాదని వరంగల్, ఖమ్మం హైవే రోడ్డుపై వద్దామనుకుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, గతంలో వరంగల్, ఖమ్మం, హైవే కోటి దాబా వద్ద ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యామ్నాయ మార్గమైన గొల్లగూడెం, ఏదులాపురం మట్టి రోడ్డుకి మోక్షం ఎప్పుడో..? అని రెండు గ్రామాల ప్రజలు విద్యార్థులు, చర్చించుకుంటున్నారు *అయ్యా మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి . శంకుస్థాపనలేనా..? మోక్షం ఏమైనా ఉందా.? ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడం అంటే ఇదేనా..? సంవత్సరం కిందట శంకుస్థాపన చేసి గాలికి వదిలేయడమే మీ దృష్టిలో మీ ప్రభుత్వం దృష్టిలో అభివృద్ధి అంటే ఇదేనా..? ఖమ్మం జిల్లాలోనే కాదండోయ్..! రాష్ట్రంలోనే ఏదులాపురం మున్సిపాలిటీని మోడరన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దటం అంటే ఇదేనా..? అభివృద్ధి మాటలు శంకుస్థాపనల వరకేనా..? 72 కోట్ల ఏదులాపురం మున్సిపాలిటీ బడ్జెట్ ఉత్తి మాటలేనా.? గాలిలో మేడలేనా..! శంకుస్థాపనలు చేయడం గాలికి వదిలేయడం మీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ప్రజలు అనుకుంటున్నారు. వెంటనే ఏదులాపురం అంబేద్కర్ విగ్రహం నుండి గొల్లగూడెం వయా ఆదిత్య నగర్ వరకు బీపీ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ ఏదులాపురం మున్సిపాలిటీ నాయకులు నారపాటి రమేష్ డిమాండ్ చేస్తున్నారు. ఈ రోడ్డుపై నిత్యం వాహనాలు నడుస్తున్నాయి. కాంట్రాక్టర్ గతంలో రోడ్డు కోసమని మట్టి పోయించారు. రోడ్డు వెడల్పు చేసినారు. వెడల్పు చేసే క్రమంలో మట్టి తోలించారు ఆ మట్టి కాస్త వర్షాలు వస్తే జారుతున్నందున టూ వీలర్ పై వెళ్లే వారికి నరకం కనబడుతుంది. ఎంతోమంది టూ వీలర్ పై వెళ్లేవారు ఆ రోడ్డుపై ప్రమాదాలకు గురి అయినారు ప్రజల ప్రాణాలు అంటే నీకు అంత చులకన పేరుకేనా.. మున్సిపాలిటీ..? ఎక్కడైనా అభివృద్ధి చేసేది ఉందా. ఏదులాపురం జిల్లా పరిషత్ హై స్కూల్లో మీరు ఇచ్చిన సైకిళ్లు తొక్కుకుంటూ వెళ్లాలా..? లేక మూసుకుంటూ వెళ్లాలా..? మీరే చెప్పండి మహాప్రభో మాపై మా రోడ్డుపై కాస్తయినా కరుణ చూపండి. విద్యార్థులను రైతులను డైలీ లేబర్ ను దృష్టిలో ఉంచుకొని నిధులు కేటాయించిందిగా ఏదులాపురం కోరుతున్నాము

