ఆలూరు ఎమ్మెల్యే అక్రమ అరెస్ట్ హేయమైన చర్య
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వేముల రాష్ట్రం లో ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్న టీడీపీ నాయకులను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షీ నీ పోలీసులతో అక్రమంగా అరెస్ట్ చేయించి రిమాండ్ కి పంపించారని ఇది ముమ్మాటికి హేయమైన చర్య అని వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం కార్యనిర్వహక సభ్యులు చల్లా సునీల్ కుమార్ తీవ్రంగా ఖండించారు.సోమవారం ఉదయం వేముల మండలం లోని స్థానిక వేముల లో వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం కార్యనిర్వహక సభ్యులు చల్లా సునీల్ కుమార్ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అనేకమంది వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రులు,మాజీ ఎమ్మెల్యేలు,మాజీ ఎంపీలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులపై దాడులు కేసులు అక్రమ అరెస్టులతో రెండేళ్ల కాలం గడిపారని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ,అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు. చెడు సంప్రదాయాలకు బీజం వేస్తున్నటువంటి బాబు సర్కార్ రాబోయే కాలం లో మూల్యం చెల్లించక తప్పదు అన్నారు. రాజకీయ కక్షలో భాగంగానే ఎమ్మెల్యే ను అరెస్టు చేయించారన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి కూటమి ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు.అక్రమంగా అరెస్టు చేసినటువంటి ఎమ్మెల్యే బుసినే విరూపాక్షీ,ఆయన కుమారుడు చంద్ర శేఖర్ తో పాటు కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలన్నారు. అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి అని అన్నారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెపుతారు అని,అక్రమ కేసుల పై న్యాయంగా పోరాడతాం అని అన్నారు.

