ePaper
Friday, August 7, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంఖమ్మం నగరాన్ని సమస్యల మయం చేసిన కాంగ్రెస్ పాలన – ప్రజల కష్టాలను పట్టించుకోని ప్రభుత్వం:...

ఖమ్మం నగరాన్ని సమస్యల మయం చేసిన కాంగ్రెస్ పాలన – ప్రజల కష్టాలను పట్టించుకోని ప్రభుత్వం: బీఆర్ఎస్ పార్టీ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి, నగరంలో పేరుకుపోయిన ప్రజా సమస్యలపై మున్సిపల్ డిప్యూటీ కమిషనర్‌ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మం నగర పాలన పూర్తిగా గాడి తప్పిందని మండిపడ్డారు. అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ప్రజా సమస్యల పరిష్కారాన్ని పూర్తిగా విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. నగరంలో పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి చెత్తను సకాలంలో తొలగించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అనేక ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగక ప్రజలు రాత్రివేళ భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. గుంతలమయమైన రోడ్ల కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయని, పార్కులు నిర్వహణ లేక నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి చెత్తను సకాలంలో తొలగించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అనేక ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగక ప్రజలు రాత్రివేళ భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. గుంతలమయమైన రోడ్ల కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయని, పార్కులు నిర్వహణ లేక నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు, నీటి కనెక్షన్ల మంజూరులో అక్రమాలు, ఇంటి పన్నుల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మున్సిపల్ డీజిల్ వినియోగంపై వచ్చిన ఆరోపణలు, పబ్లిక్ టాయిలెట్లకు అనుబంధంగా షాపుల కేటాయింపులో చోటుచేసుకున్న అవకతవకలపై స్వతంత్రంగా సమగ్ర విచారణ జరిపి, అక్రమాలు రుజువైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆసక్తి చూపకుండా కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరింత ఉద్ధృతమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రజలకు జవాబుదారీతనం కలిగిన, పారదర్శకమైన పరిపాలన అందించడం ప్రభుత్వ బాధ్యత అని, ఖమ్మం నగర ప్రజల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మాజీ నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ మార్కెట్ చైర్మన్ ఆర్ జె సి కృష్ణ, మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఖమర్, మాజీ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కర్ణాటక కృష్ణ, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మబ్బుల్, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, మాజీ కార్పొరేటర్లు బిక్కసాని ప్రశాంత లక్ష్మి, పల్లా రోషిలిని, శీలంశెట్టి వీరభద్రం, తోట రామారావు, మాటేటి నాగేశ్వరరావు, కూరాకుల వల్లరాజు, పార్టీ నాయకులు తాజుద్దీన్, గొల్లపూడి రాంప్రసాద్, దేవ భక్తిని కిషోర్, జస్వంత్, సద్దాం షేక్, మాటేటి కిరణ్, మోరంపూడి సాయి, ఆర్ విరభద్రం, షకీన, ఉస్మాన్, వీరేందర్, అశోక్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!