ePaper
Sunday, August 9, 2026
📄 ePaper
Homeతెలంగాణఎన్నికల్లో ఇచ్చిన హామీ..* *గ్రామస్తుల ఇంటి పన్నులు కట్టిన సర్పంచ్‌*

ఎన్నికల్లో ఇచ్చిన హామీ..* *గ్రామస్తుల ఇంటి పన్నులు కట్టిన సర్పంచ్‌*

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కె సతీష్ కుమార్

ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు దేవరంపల్లి గ్రామస్తుల ఇంటి టాక్స్ లను రెండు లక్షలు చెల్లించి మాట నిలబెట్టుకున్నారు సర్పంచ్ అశోక్.

శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను సర్పంచ్ గా ఎన్నికైన నుంచి ఇప్పటి వరకు రూ. 12 లక్షలతో అంగన్వాడి కేంద్రాన్ని, 10 లక్షలతో వర్క్ షెడ్, 20 లక్షలతో ఆరోగ్య ఉపకేంద్రం, 12 లక్షలతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. వచ్చే డిసెంబర్ చివరి కల్లా రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులను చేసుకుంటామని వివరించారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ అండ దండలతో.. మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మన్నే శంకర్ యాదవ్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు సురేందర్ ల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తానని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!