దమ్మపేట ఆగస్టు 10: నల్లబెల్లి మండల కేంద్రంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మ కార్యక్రమంలో బూర్గంపహాడ్–అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ని, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ని తాటి వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ,పల్లా రాజేశ్వర్ రెడ్డి , దస్యం వినయ్ భాస్కర్ , ఏనుగుల రాకేష్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ ములుగు మాజీ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబు,మాజీ సర్పంచ్ బైటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు…
