ePaper
Friday, August 14, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిపెద్దమందడి జూనియర్ కళాశాలలో ఘనంగా గ్రంథాలయ దినోత్సవం వేడుకలు

పెద్దమందడి జూనియర్ కళాశాలలో ఘనంగా గ్రంథాలయ దినోత్సవం వేడుకలు

📰 Generate e-Paper Clip

గ్రంథాలయ ఇన్చార్జి గోవర్ధన్ ను సన్మానించిన కళాశాల అధ్యాపక బృందం  పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 12 2026: పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రంథాలయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల గ్రంథాలయ ఇన్‌చార్జి గోవర్ధన్‌ను కళాశాల ప్రిన్సిపల్ జి. సైదులు, అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జి. సైదులు మాట్లాడుతూ… విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. పుస్తక పఠనం ద్వారా విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు, పోటీ పరీక్షలకు అవసరమైన అవగాహనను కూడా సాధించవచ్చని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని మంచి పుస్తకాలను చదివే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పుస్తక పఠనం ప్రాధాన్యత, గ్రంథాలయాల ఉపయోగం గురించి అవగాహన కల్పించారు. అనంతరం గ్రంథాలయ ఇన్‌చార్జి గోవర్ధన్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జి. సైదులు, అధ్యాపకులు ప్రవీణ్, గోవర్ధన్, మహేందర్, నరసింహస్వామి, సతీష్, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!