ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeతెలంగాణపూలే బాటలో… ప్రజా ప్రభుత్వం

పూలే బాటలో… ప్రజా ప్రభుత్వం

📰 Generate e-Paper Clip

14న మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఎడిటర్ బి చంద్రశేఖర్ ఆగస్టు 13 2026: హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. స్థలం: హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా, హైదరాబాద్ సమయం: మధ్యాహ్నం 3:00 గంటలకు మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు సమాజంలో విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన కృషిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుల సంఘాల నాయకులు, మహిళలు, ప్రజా ప్రతినిధులు, పూలే అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని TGSGDCFL చైర్‌పర్సన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీమతి సరిత తిరుపతయ్య కోరారు. పూలే దంపతుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సంక్షేమం, సామాజిక సమానత్వం, విద్యాభివృద్ధి దిశగా సమాజం ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. పూలే బాటలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అందరూ ఐక్యంగా పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!