– ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు సొంతంగా వ్యాపారాలు, ఉపాధి కార్యక్రమాలు చేపట్టి ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నాo,
– దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 14.2026.
మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
వేస్తుందని, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు సొంతంగా వ్యాపారాలు, ఉపాధి కార్యక్రమాలుచేపట్టిఆర్థికంగాఎదిగేలాప్రోత్సహిస్తున్నామని, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం కొత్తకోట మండలం లోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కొత్తకోట మండల మహిళా సమైక్య సర్వసభ్య సమావేశంలో ఇందిరా మహిళా శక్తి 23వ వార్షిక మహాసభ సమావేశంలో పాల్గొని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రభుత్వం అందిస్తున్నపథకాలు,అవకాశాలనుసద్వినియోగంచేసుకోవాలనిసూచించా రు.మహిళా సంఘాలను కేవలం పొదుపు సంఘాలుగా చూడటం లేదని వారిని ఆర్థిక శక్తిగా, వ్యాపార శక్తిగా తీర్చిదిద్దాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు సొంతంగా వ్యాపారాలు, ఉపాధి కార్యక్రమాలు చేపట్టి ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.మహిళా సంఘాలకు బ్యాంకు రుణ లింకేజీ, వడ్డీ లేని రుణాలు అందిస్తూ వారి ఆర్థిక అవసరాలకు అండగా నిలుస్తున్నామని, మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభించేలా నైపుణ్య శిక్షణ, బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ సదుపాయాలను కల్పిస్తున్నామని,మహిళలువారిఉత్పత్తులనుఅమ్ముకోవడానికి శిల్పారామంలో స్టాల్స్ ఏర్పాటు చేశామని వివరించారు.ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్కులు, కామన్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా మహిళలకు స్థానికంగానే ఉపాధి, ఆదాయ అవకాశాలు పెంచుతున్నామని అన్నారు.మహిళలకు స్వయం ఉపాధికల్పించేందుకు మహిళా శక్తి క్యాంటీన్లు, అలాగే అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణలో మహిళా సంఘాలను భాగస్వాములను చేశామని,పాఠశాలయూనిఫాంల కుట్టు పనులు కూడా మహిళా సంఘాలకు అప్పగించడం ద్వారా వారికి నిరంతర ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు.మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నదే మా ప్రభుత్వ ఆలోచననని అందుకే ఆర్టీసీ బస్సుల నిర్వహణ, యాజమాన్య అవకాశాలు కూడా మహిళా సంఘాలకు కల్పించామని, ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరు మీద ఇచ్చామని అన్నారు. మహిళా సంఘాల సభ్యులకు ప్రమాద బీమా, రుణ బీమా వంటి సామాజిక భద్రత కల్పించి వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగానిలిచిందన్నారు.మహిళలు ఎదిగితే కుటుంబాలు ఎదుగుతాయని, కుటుంబాలు ఎదిగితే గ్రామాలు,సమాజంఅభివృద్ధి చెందుతాయని తెలిపారు,అందులోభాగంగానేకొత్తకోటమండలంలోని మిరాసుపల్లివద్దమహిళాసంఘాలఆధ్వర్యంలోపెట్రోల్,బంక్,ప్రారం భించమని తెలిపారు.వివోఏ లజీతాలపెంపుకుసంబంధించిఅసెంబ్లీలోప్రస్తావిస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చెర్మెన్ ప్రశాంత్, కొత్తకోట మున్సిపాలిటీ వైఎస్ చెర్మెన్ పి.పల్లవి కృష్ణ రెడ్డి,కొత్తకోట మండల అధ్యక్షుడు బిసుపల్లి యాదవ్,తహశీల్దార్ శుభాస్ నాయుడు, ఎంపిడిఓ వివేక్,కౌన్సిలర్లు జె. అఖిల తండ్రి సుభాష్, పుచ్చలపల్లి సుధ రామ్మోహన్ రెడ్డి, ఎన్ జే. బోయెజ్, భీమ చంద్ర కాంత్, పి. రవీందర్ రెడ్డి, మురలియదవ్, అస్మత్ ఖాన్ సలీం ఖాన్,కరాటే అబ్దుల్ నబి, సంజీవుడు తదితరులు పాల్గొన్నారు.





