ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్*గాధరి సోమయ్య మరణం ముమ్మాటికీ రాంకి డంపింగ్ యార్డ్ చేసిన హత్య.* *జవహర్ నగర్ డంపింగ్...

*గాధరి సోమయ్య మరణం ముమ్మాటికీ రాంకి డంపింగ్ యార్డ్ చేసిన హత్య.* *జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చెర్మెన్ షేక్ శావాలి, కమిటీ సభ్యులు అల్లూరి సావిత్రి.*

📰 Generate e-Paper Clip

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కీసర సర్కిల్ : జవహర్ నగర్ : జవహర్ నగర్ గత ముప్పై సంవత్సరాల క్రితం గాధరి సోమయ్య పొట్టకూటి కోసం మేడ్చల్ జిల్లా,జవహర్ నగర్, గబ్బిలాల పేట, ఈస్ట్ నందమూరి నగర్ కు వలస వచ్చి స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు.

జీవనోపాధి కోసం పదిహేను సంవత్సరాలుగా కాంట్రక్ట్ మున్సిపల్ కార్మికునిగా పనిచేసేవాడు. రాంకి కంపెని యజమాన్యం నాలుగు మండలాల చెత్తను సేకరించి జవాహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో డంపు చేయాలని, ఐదు సంవత్సరాల వరకే ఒప్పందాన్ని కుదుర్చుకుంది, కానీ గత ఇరవై ఐదు సంవత్సరాలనుండి హైదరాబాద్ మహా నగరంలో ఉన్న చెత్తనంత జవహర్ నగర్ కు తరలించి డంపు చేస్తున్నారు.

సుమారు యాభై ఎకరాల విస్తీర్ణంలో వంద శాతం పూర్తిగా చెత్తతో నిండిపోయిందని, ప్రపంచంలో

నాలుగో ప్రాంతంగా జవహర్ నగర్ రాంఖి డంపింగ్ యార్డ్ ఉందని, ప్రపంచ మేధావులు, సైటిస్టులు,పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు.

ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోతున్న డంపింగ్ యార్డ్ ను తీసివేయడం లేదని, వచ్చే దుర్వాసన వల్ల అనేక రోగాలు గర్భ శ్రవలు, లన్స్, ఊపిరితిత్తులు, క్యాన్సర్, చర్మ వ్యాధులు, గుండె జబ్బులు, బ్రెన్ స్ట్రోక్, పసిపిల్లలు అంగవైకల్యంతో పుట్టడం అనేక అనారోగ్య సమస్యలతో నిత్యం మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

పరిసర ప్రాంతాల ప్రజలు డంపింగ్ యార్డ్ నుండి వచ్చే విషవాయువులను పీల్చుకోవడంతో ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి. ఇందులో భాగంగానే గాధరి సోమయ్య మరణంకూడా అసహజ మరణమని స్థానిక ప్రజలు వెల్లడించారు. డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మెన్ షేక్ శావాలి, చైతన్య మహిళా సంఘం అల్లూరి సావిత్రి, స్థానిక బస్తి మహిళా లీడర్ శారదా, చికెన్ యాదగిరి, అంబేద్కర్ సంఘం స్థానిక యూత్ లీడర్లు తురుగొండ కొమురయ్య, గుండె రాజు, జేరిపోతుల శేఖర్, జర్నలిస్ట్ గాధరి స్వామి తదితరులు గాధరి సోమయ్యకు నివాలు లర్పించి, వారి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రజల పాలిట శాపంగా మారినా డంపింగ్ యార్డ్ వలన అకాల మరణానికి గురైన గాదరి సోమయ్య కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చెర్మెన్ షేక్ శవాలి డిమాండ్ చేశారు. మనిషి స్వేచ్ఛగా జీవించే హక్కును కాలరాస్తున్న డంపింగ్ యార్డ్ ను పూర్తిగా తొలిగించేవరకు ప్రజలందరు ఏకమై డంపింగ్ యార్డ్ ఎత్తివేత పొరాట కమిటిలో కలిసి రావాలని కోరారు. జీవించే హక్కులో పర్యావరణ హక్కు కూడా భాగమేనని చైతన్య మహిళా సంఘం అల్లూరి సావిత్రి అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!