మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు
శామీర్ పేట్ : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏ.ఐ.సి.సి. అధ్యక్షుడు వజ్రెష్ యాదవ్ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలపై మాజీ మంత్రి పై , మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు చేస్తున్న భూకబ్జా ఆరోపణలను మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు.
శనివారం శామీర్‌పేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపించేందుకు ఆధారాలు బయటపెట్టాలని సవాల్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని, ఆధారాలు లేకుండా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
2005 తర్వాత కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు చూపిస్తా
2005 తర్వాత తాను, తన కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలన్నింటినీ బహిరంగంగా చూపించేందుకు సిద్ధంగా ఉన్నానని వజ్రేష్ యాదవ్ తెలిపారు. వాటిలో ఎక్కడైనా అక్రమంగా కబ్జా చేసిన భూమి ఉన్నట్లు నిరూపిస్తే, బాండ్ పేపర్‌పై రాసిచ్చి ఆ భూమిని పేదలకు ఇచ్చేస్తానని ప్రకటించారు.
అదే ధైర్యం మాజీ మంత్రి మల్లారెడ్డికి ఉందా అని వజ్రేష్ యాదవ్ ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేసే ముందు ఆధారాలతో ప్రజల ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
ప్రజల భూములు, హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రజల పక్షాన నిలుస్తుందని, నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను తిప్పికొడతామని తోటకూర వజ్రేష్ యాదవ్ స్పష్టం చేశారు.
