ePaper
Tuesday, August 18, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్*అల్వాల్ సీఐ ప్రశాంత్‌కు ప్రతిభ పురస్కారం.*

*అల్వాల్ సీఐ ప్రశాంత్‌కు ప్రతిభ పురస్కారం.*

📰 Generate e-Paper Clip

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.                                మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ : 80 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అల్వాల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్‌కు మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లా కమాండెంట్ సర్టిఫికెట్‌తో ప్రతిభ పురస్కారం లభించింది. జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి సమక్షంలో ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ ఆయనకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా ఏడాది కాలంగా విధులు నిర్వహిస్తున్న సీఐ ప్రశాంత్ కీలక కేసుల ఛేదనతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతిభ కనబరిచారు. విధుల్లో అంకితభావం, వేగవంతమైన చర్యలు, నైపుణ్యంతో సమర్థవంతమైన పోలీసింగ్‌ అందించడాన్ని గుర్తించిన అధికారులు ఆయనకు ఈ పురస్కారం అందజేశారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సమర్థవంతమైన పోలీసింగ్‌కు ఆదర్శంగా నిలిచారని అధికారులు ప్రశంసించారు. ప్రశంసా పత్రం అందుకున్న సీఐ ప్రశాంత్‌ను అల్వాల్ పోలీస్ సిబ్బంది, స్థానికులు అభినందించారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!