ePaper
Monday, August 17, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిజిల్లాలో నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మినుములు, వేరుశెనగ, మొక్కజొన్న, ఆముదం వంటి ఆరుతడి...

జిల్లాలో నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మినుములు, వేరుశెనగ, మొక్కజొన్న, ఆముదం వంటి ఆరుతడి పంటలకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలి

📰 Generate e-Paper Clip

–ప్రత్యామ్నాయపంటలసాగుపైరైతులకుఅవగాహనకల్పించేందుకురూపొందించినపోస్టర్‌నుఆవిష్కరించిన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 18.2026.

జిల్లాలో నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మినుములు, వేరుశెనగ, మొక్కజొన్న, ఆముదం వంటి ఆరుతడి పంటలకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్ సూచించారు.సోమవారం అదనపు కలెక్టర్ తనఛాంబర్‌లోజిల్లావ్యవసాయఅధికారిఅంజనేయులుతో కలిసి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నీటి లభ్యత తక్కువగాఉన్నప్రాంతాల్లో మినుములు, వేరుశెనగ, మొక్కజొన్న, ఆముదం వంటిఆరుతడిపంటలకురైతులుప్రాధాన్యతఇవ్వాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేసే పంటల ద్వారా నీటి వనరులను ఆదా చేయడంతో పాటు రైతులకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. కంది – మినుములు, ఆముదం – మినుములు, మొక్కజొన్న–మినుములు వంటి అంతర పంటల సాగును రైతులు చేపట్టేలా ప్రోత్సహించాలనిఅధికారులకుసూచించారు.ఎల్‌నినో పరిస్థితులనుదృష్టిలోఉంచుకునిరైతులకుప్రత్యామ్నాయపంటలసాగుపైక్షేత్రస్థాయిలోవిస్తృతంగాఅవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి, నీటి లభ్యత, నేల పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికపై అవసరమైన సూచనలు అందించాలని తెలిపారు.రైతులు రానున్న నీటి కొరత పరిస్థితులను అంచనా వేసుకుని తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంజనేయులు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి విజయభాస్కర్, డి ఎల్ పి ఓ రఘునాథ్, హౌసింగ్ పీడీ విఠోబా, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!