రికార్డులు, సీసీటీఎన్ఎస్, సైబర్ క్రైమ్ పనితీరుపై సమీక్ష
పొలిటికల్ పవర్, ఆగస్టు 26,దమ్మపేట: దమ్మపేట పోలీస్‌స్టేషన్‌ను పాల్వంచ ఎస్డీపీవో బుధవారం వార్షికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని సిబ్బంది హాజరు, కిట్ సామాగ్రి, స్టేషన్ పరిసరాలు, నేరాలకు సంబంధించిన వాహనాలు, వివిధ రికార్డులను పరిశీలించారు. అలాగే CCTNS, సైబర్ క్రైమ్ విభాగాల పనితీరును సమీక్షించారు.
ఆన్లైన్లో ఎలాంటి పనులు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. విధుల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని ఆదేశించారు. e-Sakshya (ఈ-సాక్ష్య), ONSITE FIR ప్రక్రియలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
కోర్టు కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణలో నాణ్యత పాటించాలని తెలిపారు. నేరాల నియంత్రణలో భాగంగా ప్రతి గ్రామంలో CCTV కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే గంజాయి వినియోగానికి అలవాటు పడిన వారిని గుర్తించి, అవసరమైన కౌన్సెలింగ్ అందిస్తూ వ్యసన విముక్తి కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బందికి సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్డీపీవో సూచించారు.
ఈ వార్షిక తనిఖీలో అశ్వారావుపేట సీఐతో పాటు దమ్మపేట పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

