పొలిటికల్ పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ 29. ఆగస్టు 2026. రాఖీ అనేది సోదరి తన సోదరుడికి కట్టే ఒక పవిత్రమైన దారం. ఇది వారి మధ్య ఉన్నప్రేమ,రక్షణఅనుబంధాన్నిసూచి స్తుంది. సోదరుడు తన సోదరిని అన్ని కష్టాల నుండి రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. రాఖీ పండుగను ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని వడ్డే వాట రోడ్ లో గల శ్రీ మహానంద మల్కి దాస్ ఆశ్రమంలో, శుక్రవారం ఆన్నదమ్ములకు అక్క చెల్లెలు రాఖీలు కట్టి ఘనంగా రాఖీ పండుగ దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పండుగ రోజున సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి, తీపి పదార్థాలు తినిపిస్తారు, అలాగే సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు ఇస్తారు. రాఖీ పండుగ వెనుక అనేక పురాణ కథలు ఉన్నాయి. వాటిలో ఒక కథనం ప్రకారం, ద్రౌపది తన చీర కొంగును శ్రీకృష్ణుడి గాయపడిన వేలికి కట్టిందని, దానితో ఆమెకు రక్షగా నిలిచింది. అప్పటినుంచి రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తుంది. రాఖీ పండగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు.ఆ రోజును సోదరి, సోదరుడి మధ్య పవిత్ర సంబంధానికి చిహ్నంగా భావిస్తారు. సోదరి తనసోదరుడిమణికట్టుకురాఖీకట్టిఅతనిదీర్ఘాయుష్షు, ఆనందాన్నికోరుకుంటుంది.సోదరుడుతనజీవితాంతం ఆమెను రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే రాఖీని సోదరుడికి మాత్రమే కట్టవచ్చా మరికేవరికైనా కట్టవచ్చా ఈ రోజుతెలుసుకుందాం.
సోదరుడు, సోదరీమణుల మధ్య విడదీయరాని ప్రేమకు చిహ్నంగా నిలిచే రాఖీ పండగ భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన పండుగ. శతాబ్దాలుగా సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి వారికి దీర్ఘాయుష్షు, ఆనందాన్ని కోరుకోవడం, సోదరులు తమ సోదరీమణులను రక్షించడానికి ప్రతిజ్ఞ చేయడం ఒక సంప్రదాయం. రాఖీ పండుగ రోజున ఒక సోదరి తన సోదరుడికి కాకుండా మరెవరికి రాఖీకట్టగలదోతెలుసుకుందాం. దేవుడికి రాఖీ కట్టే సంప్రదాయం రాఖీ కట్టే మొదటి హక్కు దేవుడిదే అని భావిస్తారు.చాలామందిసోదరీమణులు మొదట శ్రీకృష్ణుడు, శివుడు లేదా గణేశుడికి రాఖీ కడతారు. తరువాత తమ సోదరుడికి రాఖీకడతారు. ఇలా చేయడం అంటే దేవుడే తమకుమొదటిరక్షకుడు అనే విశ్వాసానికి నిదర్శనం. అక్కకి చెల్లెలు రాఖీకట్టే సంప్రదాయం ఏ యువతికి అయినా అన్నదమ్ములు లేకుంటే ఆమెకు అక్కాచెల్లెలు ఉన్నట్లు అయితే ఆమె తన అక్కకు రాఖీకట్టవచ్చు. ఇదిసోదరీమణుల అనుబంధం, ప్రేమ, ఐక్యతకు చిహ్నం. గురువుకు రాఖీ భారతీయ సంస్కృతిలో గురువును దేవునితో సమానంగా భావిస్తారు.
ఒక శిష్యుడు తన గురువుకు రాఖీ కట్టడం అంటే.. అతను గురువును రక్షించి, సేవ చేసి, గౌరవిస్తానని వాగ్దానం చేస్తున్నట్లు అర్థం. పూజారులు, సాధువులు, ఋషులకు రాఖీ చాలా ప్రదేశాలలో మహిళలు సాధువులు, ఋషులు లేదా ఆలయ పూజారులకు రాఖీ కడతారు. ఇది మత విశ్వాసం, ఆధ్యాత్మిక సంబంధానికి గుర్తుగా నిలుస్తుంది. ఈ సంప్రదాయం ముఖ్యంగా బృందావనం, మధుర, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో కనిపిస్తుంది. సైనికులకు రక్షణ దారంగా రాఖీ సందర్భంగా సోదరీమణులు భారత సైన్యం, పోలీసు, పారామిలిటరీ దళాల సైనికులకు రాఖీని పంపుతారు లేదా వారే వెళ్లి స్వయంగారాఖీని కడతారనివారుతెలిపారు.ఈకార్యక్రమంలోధూపం.ఈశ్వర్,ధూపం.శివశంకర్,ధూప.శివరములు,టి.తిరుపతమ్మ,యస్.వెం కటేశ్వరమ్మ,టి.సౌభాగ్యలక్ష్మి, యం. శంకరమ్మ,డి. భవ్య శ్రీ, యస్.తేజస్విని,యం. వైష్ణవి, లక్మన్న,ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.







