కూతురును నడుముకి కట్టుకొని బావిలో దూకిన మహిళ 
ఆగస్టు 31: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
తల్లి కూతురు మృతి
మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ఆదివారం రోజున జరిగిన ఘటన, కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన ఓ మహిళ తన కూతుర్ని నడుముకు కట్టుకొని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకెళ్తే లింగాపూర్ గ్రామానికి చెందిన గుట్ల లచ్చన్న కూతురు రజిత (28) కు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఏనుగుమట్ల గ్రామానికి చెందిన మెరుగు అంజన్నతో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి (5) అక్షిత బాబు (2) ఉన్నారు.భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో రజిత నాలుగేళ్లగా తల్లి గారి ఊరు లింగాపూర్ ఉంటుండగా.అంజన్న అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. అంజన్న ఆదివారం ఉదయం వచ్చాడు.రజిత తల్లి వ్యవసాయ పనులకు వెళ్లగా దిక్వాంగుడైన తండ్రి ఇంట్లోనే ఉన్నాడు.రజిత తల్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కూతురు కనిపించకపోవడంతో అల్లుడు అంజన్నను ప్రశ్నించింది.అతడు సమాధానం చెప్పకుండా మొబైల్ ఆఫ్ చేసుకుని పరారయ్యాడు. తల్లిదండ్రులు స్థానికులు చుట్టుపక్కల గాలించగా.సమీపంలోని వ్యవసాయ బావిలో రజిత అక్షిత డెడ్ బాడీలు కనిపించాయి.సమాచారం అందుకున్న దండేపల్లి ఎస్సై రాజవర్ధన్ ఘటన స్థలానికి వివరాలు సేకరించారు.

