ePaper
Tuesday, September 1, 2026
📄 ePaper
Homeతెలంగాణ29 ఏళ్ల ఆర్టీసీ సేవలకు వీడ్కోలు.. వి.టి. గౌడ్‌కు ఘన సన్మానం

29 ఏళ్ల ఆర్టీసీ సేవలకు వీడ్కోలు.. వి.టి. గౌడ్‌కు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా విధులు.. పదవీ విరమణ సందర్భంగా ఆత్మీయ అభినందనలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 31, 2026: ద్వాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా సుమారు 29 సంవత్సరాల పాటు సేవలందించి పదవీ విరమణ పొందిన వి.టి. గౌడ్ కు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, మాజీ ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానం చేసి హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వహించిన వి.టి. గౌడ్.. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ బాధ్యతాయుతంగా సేవలందించారని పలువురు కొనియాడారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కంటికి రెప్పలా ఆర్టీసీ బస్సులను, అందులో ప్రయాణించే ప్రయాణికులను కాపాడుతూ తన విధులను సమర్థవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. ఉద్యోగ జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ విధులకు అంకితభావంతో పనిచేసి, తన 29 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందడం అభినందనీయమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం వి.టి. గౌడ్ ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితం గడపాలని పలువురు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొని వి.టి. గౌడ్‌కు తమ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.

సోదరుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు

బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వి.వి. గౌడ్ మాట్లాడుతూ… గత 29 సంవత్సరాలుగా ఆర్టీసీలో డ్రైవర్‌గా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, ప్రయాణికుల భద్రతను కంటికి రెప్పలా కాపాడుతూ ఉద్యోగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందుతున్న తన సోదరుడు వి.టి. గౌడ్‌కు హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!