ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్*జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీలతో సమావేశం.

*జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీలతో సమావేశం.

📰 Generate e-Paper Clip

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.

కీసర సర్కిల్ :జవహర్‌ నగర్:     విఘ్నేశ్వర నవ రాత్రి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.                                                                  ఈ సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీస్ శాఖ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని అధికారులు తెలిపారు. ప్రతి మండపాన్ని ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా, సురక్షిత ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలని, భక్తులు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.                             గణేష్ ఉత్సవాలను ఆధ్యాత్మికత, భక్తి మరియు సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిర్వహిస్తూ, అక్రమ కార్యకలాపాలు, దొంగతనాలు మరియు ఇతర అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా మండపాల వద్ద భద్రతా చర్యలు పాటించాలని పోలీస్ అధికారులు కోరారు. మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.                                                                      ఈ సమావేశానికి జవహర్‌నగర్ బీజేపీ అధ్యక్షుడు కమలాకర్ తో పాటు హిందూ సంఘాల ప్రతినిధులు మరియు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను పోలీస్ శాఖ ఆహ్వానించింది. వారు పోలీస్ శాఖకు తమ సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. “భక్తితో గణేశుడిని ఆరాధిద్దాం – బాధ్యతతో ఉత్సవాలను నిర్వహిద్దాం – జవహర్‌నగర్‌లో శాంతి, భద్రతలను కాపాడుదాం” అనే సందేశంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ కలిసి పనిచేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.                       జై శ్రీ గణేశ్ 🙏💐గణపతి బప్పా మోరియా!

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!