ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

ముదిగొండ, మండలంలొ వినాయక చవితి ఉత్సవాలపై అవగాహన కార్యక్రమం…

📰 Generate e-Paper Clip

డీజేలకు అనుమతి లేదు…

మండపాల నిర్వాహకులదే పూర్తి బాధ్యత..

సిఐ వడ్డేపల్లి మురళీ…

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి. రమేష్ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ముదిగొండ సిఐ వడ్డేపల్లి మురళీ ఆధ్వర్యంలో డీజే నిర్వాహకులు, గణేష్‌ మండపాల నిర్వాహకులతో గురువారం పోలీసు స్టేషన్ అవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహాల ఏర్పాటు కోసం నిర్వాహకులు ముందస్తుగా ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా అనుమతి పొందాలని, గణేష్‌ మండపాల వద్ద నిర్వహించే కార్యక్రమాలకు నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. మండపాల వద్ద డీజేలను ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు పోలీసులకు నిర్వాహకులు పూర్తిగా సహకరించాలని సూచించారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని మురళీ కోరారు. నిబంధనలను పాటిస్తూ భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.

Latest Articles

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ డప్పు ధర్నా

దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా బీఆర్ఎస్ వ్యవహరించిందని ఆరోపణపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

బిక్కవోలు పోలీసుల దాడులు.. అక్రమ బాణసంచా తయారీ గుట్టురట్టు

  బిక్కవోలు: బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా తయారు...

రాజీ మార్గం ద్వారాకేసులకుసత్వరపరిష్కారంసత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యం

–3వ జాతీయ లోక్ అదాలత్‌లో 6,617 కేసుల పరిష్కారం,జిల్లా...

అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయ్యాలి

– దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్,– కొత్తకోట ఎస్సైలు...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!