– గణపతి మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, గణేష్ ఉత్సవాల లో అధిక శబ్దం వచ్చే డీజే లకు అనుమతులు లేవు,
– ప్రజలు సోషల్ మీడియాలో వచ్చేవదంతులను నమ్మవద్దు, గణపతి మండపనిర్వాహకసభ్యులు, వివిధ మతపెద్దలతో సమన్వయ సమావేశం,
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ -12.2026.గణపతినవరాత్రిఉత్సవాలనుప్రశాంతవాతావరణంలో నిర్వహించాలని, గణపతి మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, గణేష్ ఉత్సవాలలోఅధికశబ్దంవచ్చేడీజేలకుఅనుమతులు లేవని,ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దనిజిల్లా ఎస్పీ.సునిత రెడ్డి అన్నారు.శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో పోలీసుశాఖఆధ్వర్యంలోవనపర్తి జిల్లావ్యాప్తంగాగణపతినవరాత్రిఉత్సవాలనుప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకుముందస్తుచర్యల్లో భాగంగాజిల్లాలోనిఅన్నిమండలాలపట్టణాల,గ్రామాల వినాయక మండప నిర్వహకులు , హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు, ఉత్సవకమిటీసభ్యులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులతో శాంతి సమావేశం నిర్వహించారు.ఈ సమన్వయ సమావేశంలో జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మండప నిర్వహణ కమిటీలు సభ్యులకు పలు సూచనలు చేశారు.ఈగణపతివిగ్రహాలఏర్పాటుప్రశాంతవాతావరణంలో ప్రజలందరూ పట్టణాలలో గ్రామాలలో కలిసి మెలిసి సోదర భావంతో నిర్వహించుకోవాలని జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. పోలీసు యంత్రాంగం పూర్తి సంసిద్ధంగాఉందనిమండపనిర్వహణకమిటీసభ్యులనుఉద్దేశించిపలుసూచనలుఆన్లైన్లోవచ్చినhttps://policeportal.tspolice.gov.in లింకు ద్వారా ప్రతి ఒక్క గణపతి మండపం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, దీనిద్వారాగణపతినవరాత్రిఉత్సవాలలోచేయవలసిన బందోబస్తు కేటాయించవలసిన పోలీసు సిబ్బంది నిమర్జనం ఏర్పాట్లకు మరియు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఏర్పాట్లను పూర్తిచేస్తున్నట్టుతెలిపారు.ఈసందర్భంగా జిల్లా ఎస్పీ. మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంగా భారతదేశం విరజిల్లుతున్నదని, ఒక మతాన్ని ఇంకో మతంవారినిఆదరించుకుంటూపండుగలుజరుపుకునే సంస్కృతి మన వనపర్తి జిల్లాలో ఉన్నదని, అన్ని మతాల సారం ఒక్కటేనని తెలిపారు.రానున్న గణేష్ ఉత్సవాలనుప్రశాంతవాతావరణంలోజరుపుకోవాలని, ఇతర మతస్తులను గౌరవిస్తూ తమ పండుగలు శాంతియుతంగాజరుపుకోవాలని,ఇలాంటిసమయాల్లో ప్రజలు తమ ఐక్యతను చాటుకోవాలని వనపర్తి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.
పండుగనుప్రజలంతాతమపండుగనుశాంతియుతంగా జరుపుకోవాలని పోలీసులు అవసరం అనుకున్న ప్రదేశాల్లోబందోబస్తుఏర్పాటుచేయడంజరుగుతుందని, నిర్విరామంగా పెట్రోలింగ్ నిర్వహిస్తూ, ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా చూస్తామని అందుకు ప్రజలంతా పోలీసువారికి పూర్తి సహకారం అందించాలని తెలిపారు.పండుగల సమయంలో అక్కడఅక్కడఏమైనాచిన్నసంఘటనజరుగుతాయని తమదృష్టికివస్తేవెంటనేపోలీసులదృష్టికితీసుకురావాలని కోరారు.ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే అలాంటి వారిపై ప్రత్యేక నిఘాపెట్టివారిపైకఠినచర్యలుతీసుకోవడంజరుగుతుందని తెలిపారు. అదేవిధంగా వివిధ కులాల మత పెద్దలు, మసీదులు, దేవాలయాలు, చర్చ్ ల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు, ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు.ఈ సందర్బంగా మతపెద్దలు,ఉత్సవకమిటీ సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో అన్నిమతాలప్రజలు పరస్పరసహకారంతోపండుగలనునిర్వహించుకుంటూ వస్తున్నారని, ఇదే స్ఫూర్తితో గణేష్ నవరాత్రి ఉత్సవాలనుకూడాసామరస్యపూర్వకంగా,శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసు, రెవెన్యూ మరియు ఇతర శాఖలకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలిపారు.
– గణేష్ మండపాలు ఏర్పాటు చేసేవారికి వనపర్తి జిల్లా పోలీసుల సూచనలు,
గణేశుని మండపాల వద్ద 24 గంటలు కనీసం ఇద్దరు వాలంటీర్లు విగ్రహంతో పాటు ఉండాలి. జంతువులు కోతులులోనికిరాకుండాచూసుకోవాలి,గణేష్,మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చూడాలి, గణేశుని మండపాల వద్దకు మద్యం సేవించి రాకుండాకమిటీనిర్వాహకులు చూసుకోవాలి,మండపాల వద్ద ఎలాంటిటపాకాయలు కాల్చారాదు,గణేష్,మండపాలనిర్వహకులుతప్పనిసరిగాపోలీసులఅనుమతితీసుకోవాల్సివుంటుందని,ఇందుకోసం ముందుగా నిర్వహకులుతాముఏర్పాటు చేసేగణేష్,ప్రతిమఎత్తు,ఏర్పాటుచేస్తున్నప్రదేశం,నిమజ్జనం తేదీ,ప్రదేశం మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్,ప్రోటోకాల్,వెబ్సైట్,https://policeportal.tspolice.gov.in ద్వారా మండపాల నిర్వహకులు పూర్తి వివరాలను నమోదుచేసుకోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని,దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులు ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీచేస్తారని తెలిపారు. గణేష్ మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటుచేసుకోవాలి,గణేష్,మండపాలనిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు,మండపాల బాధ్యత వహించే వారి వివరాలు,ఫోన్ నెంబర్లతో కూడినఫ్లెక్సీలనుమండపంలోఏర్పాటుచేయాలి. వృద్ధులు,చదువుకునేవిద్యార్ధులకుఎలాంటిఇబ్బందులకు కలగకుండా తక్కువ శబ్దకాలుష్యంతో స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలి,సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి10.గంటలవరకుమాత్రమేస్పీకర్లనువినియోగించాలి,మండపాల్లోఎట్టిపరిస్థితులోనుడిజేలనుఏర్పాటు చేయరాదు, గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శనను దృష్టిలో వుంచుకోని మండపాలలో భక్తుల కోసం క్యూలైన్లనుఏర్పాటుచేసుకోవాలి,విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి,పోలీసు అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో ఏ ఆర్ అదనపు ఎస్పీ ,వీరారెడ్డి , వనపర్తి సీఐ, సుగంధ రత్నం, కొత్తకోట సీఐ, ఓ డి, రమేష్, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, జిల్లాలోని ఎస్సైలు పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ మతాల కుల పెద్దలు, మరియు రాజకీయ పార్టీల నాయకులు, పెద్దలు మరియు జిల్లాలోని యువకులు కార్యాలయ సిబ్బంది పోలీసు అధికారులు, సిబ్బంది, పాత్రికేయులు పాల్గొన్నారు.








