మొగుళ్ళపల్లి మండలం పెద్ద కొమటిపల్లి గ్రామానికి చెందిన దొంగల రాజేందర్ కత్తితో భార్య కోమలిపై దాడి
//పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక & పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి టేకుమట్ల ఎల్ల స్వామి//
ఆరేపల్లి గ్రామానికి చెందిన దొంగల కోమలమొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటి పల్లి గ్రామానికి చెందిన దొంగల రాజేందర్ తో ఆరు సంవత్సరాల క్రితం వివాహమైనది వీరి సంసారజీవితంలో ఇద్దరు కొడుకులు పెద్ద బాబు ఐదు సంవత్సరాలు.చిన్న బాబు మూడు సంవత్సరాలు కలరు గత రెండు సంవత్సరాలనుండి రాజేందర్ నుండి మద్యం సేవించి కోమల ను శారీరకంగా మానసికంగా వేదించిగా ఇటీవల అట్టి బాధ భరించలేక తల్లి గారింటికి ఆరెపల్లి కి రాగ,, రాజేందర్ ఇట్టి విషయంలో కోమల మీద కోపం పెంచుకొని తేది 01-09-2026న రాజేందర్ మద్యం సేవించి ఆరెపల్లి లోని కోమల ఇంటికి వచ్చి భార్య కోమల తో గొడవ పడి కత్తి తో పొడిచి చంపే ప్రయత్నం చేయగా కోమల చెయ్యి అడ్డుపెట్టగా చేతి మీద మరియు నడుము మీద కత్తి గాయలైనాయని పిర్యాదు ఇవ్వగా ఈ రోజు రాఘవరెడ్డి పేట్ శివారులో వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో రాజేందర్ ను పట్టుకొని విచారణ చేసి కోర్టు కు హాజరు పరిచినామని టేకుమట్ల సబ్ ఇన్స్పెక్టర్ జి . అమూల్య తెలిపారు

