ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు  సమాన ప్రాధాన్యత ఇచ్చి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలి

📰 Generate e-Paper Clip

–ప్రభుత్వప్రైవేటుపాఠశాలలకుచెందినవిద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

–  కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణా శ్రీనివాస్,

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రికపిఎన్.9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్. సెప్టెంబర్. 19. 2026.విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు  సమాన ప్రాధాన్యత ఇచ్చిగెలుపోటములనుసమానంగాస్వీకరిస్తూక్రమశిక్షణ,పట్టుదలతోముందుకుసాగాలని,కొత్తకోటమున్సిపల్ చైర్‌పర్సన్ అరుణాశ్రీనివాసులుఅన్నారు.శుక్రవారం వనపర్తిజిల్లాకొత్తకోటమున్సిపల్,కేంద్రంలోదేవరకద్రశాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి సూచనలమేరకు అండర్‌14,అండర్‌17బాలబాలికలకుమండలస్థాయి క్రీడా పోటీలు, సెలెక్షన్స్‌ను  స్పోర్ట్స్ డేగా ఉత్సాహంగా నిర్వహించారు.మండలంలోనివివిధప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణా శ్రీనివాస్  పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు ఒక మంచి కథ ద్వారా స్ఫూర్తిని అందిస్తూ, విజయం ఒక్కరోజులో రాదని, నిరంతర సాధన, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు.ఓటమిఎదురైనప్పుడునిరుత్సాహపడకుండా, దానిని ఒక పాఠంగా తీసుకుని మరింత కష్టపడి ప్రయత్నించాలని విద్యార్థులకు సూచించారు.క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు భావన, క్రమశిక్షణను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న ప్రతి విద్యార్థి తనప్రతిభనుపూర్తిస్థాయిలోప్రదర్శించిఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సాయిదయ్య , కొత్తకోట ఎస్‌ఐ విక్రం రాథోర్ , వైస్ చైర్‌పర్సన్ పల్లవి కృష్ణారెడ్డి , పాఠశాలల సిబ్బంది, ఉపాధ్యాయులు, క్రీడా నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

కలసపాడు నూతన ఎస్సైగా హనుమంతు

కలసపాడు సెప్టెంబర్ 19 పొలిటికల్ పవర్ 9 టీవీ తెలుగు జాతీయ...

పేషెంట్ నేమ్ తమన్నాటైఫాయిడ్ జ్వరంతో నిలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న...

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్...

గురుకుల విద్యాలయాల్లో నాసరికం సరుకుల పంపిణీ పేద బిడ్డల కడుపు కొడుతున్న నేకాఫ్ కాంట్రాక్ట్ దంధా

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం సెప్టెంబర్ 28న అశ్వరావుపేటలో ప్రధమ మహాసభ

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యంసెప్టెంబర్ 28న అశ్వారావుపేటలో టీజెఎంయు...

Related Articles

శ్రీరంగాపూర్‌లో గణనాథునికి ప్రత్యేక పూజలు

వినాయక ఉత్సవ కమిటీకి పలుస శంకర్ గౌడ్, మాజీ ఎంపీపీ పృథ్వీరాజ్ అభినందనలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్...

సుమిత్ర పార్థివ దేహానికి జిల్లా విద్యాశాఖ అధికారి యదయ్య నివాళులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 19 2026: పెబ్బేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు), పెబ్బేరులో...

ప్రాధాన్యత ఇచ్చి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలి–ప్రభుత్వప్రైవేటుపాఠశాలలకుచెందినవిద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.–  కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర...
error: Content is protected !!