ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

సుమిత్ర పార్థివ దేహానికి జిల్లా విద్యాశాఖ అధికారి యదయ్య నివాళులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 19 2026: పెబ్బేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు), పెబ్బేరులో ఎస్‌ఏ ఇంగ్లీష్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి సుమిత్రమ్మ ఆకస్మికంగా మృతి చెందడంతో జిల్లా విద్యాశాఖ అధికారి యదయ్య ఆమె నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీఈఓ యదయ్య మాట్లాడుతూ… విద్యారంగానికి సుమిత్రమ్మ అందించిన సేవలు మరువలేనివని అన్నారు. గతంలో గోపాల్‌పేట బాలికల పాఠశాల ఉన్నతీకరణకు ఆమె విశేష కృషి చేశారని, ఎఫ్‌ఏసీ ప్రధానోపాధ్యాయురాలిగా సమర్థవంతంగా సేవలందించారని కొనియాడారు. విద్యార్థుల పట్ల ఆమె చూపిన ప్రేమ, అంకితభావం, విద్యాబోధనలో ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థుల పట్ల సుమిత్రమ్మ చూపిన ప్రేమ, ఆప్యాయత, అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఆమె మృతి విద్యారంగానికి తీరని లోటని పేర్కొన్నారు. సుమిత్రమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. సుమిత్రమ్మకు నివాళులు అర్పించిన వారిలో ఎంఈవో జయరాములు, ప్రధానోపాధ్యాయుడు సుదర్శన్, వెంకటేశ్వర శెట్టి, పదవీ విరమణ పొందిన జీహెచ్‌ఎం శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

Latest Articles

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం సెప్టెంబర్ 28న అశ్వరావుపేటలో ప్రధమ మహాసభ

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యంసెప్టెంబర్ 28న అశ్వారావుపేటలో టీజెఎంయు...

ఎన్సీపీ–ఎన్డీఏ–ఎన్వైసీ నూతన జిల్లా యువజన అధ్యక్షుల నియామకం

  పొలిటికల్ పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి–ఎన్వైసీ...

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల పోలీస్ స్టేషన్ను అకస్మికంగా తనిఖీ చేసిన డిఎస్పి సంపత్ రావు

 *పొలిటికల్ పవర్ ప్రతినిధి టేకుమట్ల ఎల్లస్వామి*శనివారం 19...

ఖమ్మం నగరం లోని శ్రీనివాస్ నగర్ ఇండ్ల సమస్యపై భవిష్యత్తు కార్యాచరణ చేపడతాం – నున్నా, వై విక్రమ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయం.. ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు తీర్పు పై సవాల్

హైదరాబాద్: పొలిటికల్ పవర్ ప్రతినిధి నాగరాజు రెడ్డితన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు...

Related Articles

శ్రీరంగాపూర్‌లో గణనాథునికి ప్రత్యేక పూజలు

వినాయక ఉత్సవ కమిటీకి పలుస శంకర్ గౌడ్, మాజీ ఎంపీపీ పృథ్వీరాజ్ అభినందనలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్...

ప్రాధాన్యత ఇచ్చి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలి–ప్రభుత్వప్రైవేటుపాఠశాలలకుచెందినవిద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.–  కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర...

ప్రాధాన్యత ఇచ్చి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలి–ప్రభుత్వప్రైవేటుపాఠశాలలకుచెందినవిద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.–  కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర...
error: Content is protected !!