ePaper
Sunday, September 20, 2026
📄 ePaper

తమిళనాడులో టీవీకే పార్టీ ముఖ్య నేత రమేష్ కుట్టితో మద్దిశెట్టి సామేలు భేటీ

📰 Generate e-Paper Clip

 పొలిటికల్ పవర్, సెప్టెంబర్, 20: చెన్నై / తమిళనాడు:తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకే పార్టీ ముఖ్య నేత రమేష్ కుట్టితో ఎన్సీపీ పార్టీఎన్డీఏ మహాకూటమిఎన్వైసీ జాతీయ నాయకులు మద్దిశెట్టి సామేలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ఈ భేటీ తమిళనాడు రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలోపేతం, యువత, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అలాగే తమిళనాడు రాష్ట్రంలో ఎన్సీపీ పార్టీని, ఎన్వైసీ విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు.

తమిళనాడులో టీవీకే పార్టీకి యువతలో ఉన్న ఆదరణ, ఎన్డీఏ కూటమి విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం గురించి ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్డీఏ మహాకూటమి మరింత బలంగా ముందుకు సాగేందుకు ఇరు పార్టీల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉపయోగపడతాయని ఇరువురు ఆకాంక్షించారు.

ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని, రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు ఉంటాయని మద్దిశెట్టి సామేలు తెలిపారు.

Latest Articles

కొత్తూరులో గణపతి నవరాత్రులు పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమం..

పార్కలగండి సర్పంచ్ కొమరం సుశీలకు ఘన సన్మానం పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20:...

అనారోగ్య బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

పొలిటికల్ పవర్, దమ్మపేట, సెప్టెంబర్ 20: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,...

విఘ్నేశ్వర ఆశీస్సులతో... సుఖీభవ! > "వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభః | > నిర్విఘ్నం...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరంసెప్టెంబర్ 20:...

అవుట్ డోర్ అడ్వర్టైజ్మెంట్ రంగం లో నిబంధనలు పాటించాలి కే శోభా రెడ్డి

 - పారదర్శకమైన విధానాలు ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

ఇన్ఫినిటీ ఇండియా మాల్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా వినాయక సంబరాలు

*ఇన్ఫినిటీ ఇండియా మాల్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా వినాయక సంబరాలు* *ఇన్ఫినిటీ మాల్టా...

Related Articles

గణనాథుడిని దర్శించి.. బాధితులను పరామర్శించిన సోయం వీరభద్రం

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20 :అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పార్కల గండి గండి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం సుడిగాలి పర్యటన చేశారు.గ్రామస్థుల ఆహ్వానం మేరకు పార్కలగండి గణేష్ మండపం...

నేటి విద్యార్థుల ప్రవర్తనలో ఆందోళనకర మార్పులు బాధ్యత ఎవరిది??? JSPWS

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి** పాఠశాలల్లో క్రమశిక్షణ లోపిస్తోందంటూ ఉపాధ్యాయుల ఆవేదన* అతి...
error: Content is protected !!